Begin typing your search above and press return to search.
వైరల్ అవుతున్న అతిలోకసుందరి ఫ్యామిలీ ఫోటో..
By: Tupaki Desk | 18 April 2020 12:10 PM GMTప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో అతిలోకసుందరి శ్రీదేవి కుటుంబంతో కలిసి ఉన్న త్రోబాక్ చిత్రాన్ని పంచుకున్నారు. ఆ ఫొటోలో బోనీ కపూర్, దివంగత నటి శ్రీదేవి, వారి కుమార్తెలు జాన్వి, ఖుషీ ఫోటోకి పోజివ్వడం మనం చూడవచ్చు. సాంప్రదాయ దుస్తులలో శ్రీదేవి తన కుటుంబంతో ఎంతో ఆనందంగా ఆ తీరు చూస్తే కళ్ళకు ఎంతో మనోహరంగా అన్పిస్తుంది. ఈ అందమైన ఫ్యామిలీ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ రత్నాని - "ఎ పిక్చర్ ఈజ్ వర్త్ థౌసండ్ వర్డ్స్ - ఎన్నో అద్భుతమైన - అమూల్యమైన జ్ఞాపకాలతో కూడుకున్నది" కింద కాప్షన్ రాసారు.
ప్రస్తుతం ఈ దివంగత అతిలోకసుందరి ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ.. లక్షల సంఖ్యలో లైక్స్ - హార్ట్స్ షేర్స్ తో వైరల్ అవుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ మొదటి మహిళా సూపర్ స్టార్ శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ వేలసంఖ్యలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. అందులో కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ఈ ఫొటోలో శ్రీదేవి మేడంను చూసి ఎంతో ఉద్వేగానికి గురయినట్లు తెలిపారు. అంతేగాక శ్రీదేవి మేడం ఫోటో చూస్తుంటే.. ఆమె అందమైన నవ్వు గౌరవప్రదమైన నడవడిక ఎంత ఎదిగినా ఒదిగే లక్షణం ఆమె సొంతం అంటూ అభిమానాన్ని చాటుకున్నారు. అందమైన శ్రీదేవి గారిని చూసి ప్రేమలో పడని భారతీయులు ఉండరనే చెప్పాలి. ఎంతో విలువైన శ్రీదేవి గారి ఫోటోను మాతో పంచుకున్నందుకు ఫోటోగ్రాఫర్ రత్నానికి నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి ప్రస్తుతం మన మధ్య లేనప్పటికీ భారతీయుల గుండెల్లో ఎప్పటికి జీవిస్తూనే ఉంటారని ప్రముఖులు వారి అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు.