Begin typing your search above and press return to search.

మహేష్ ఏంటి ఇలా ఉన్నాడు...?

By:  Tupaki Desk   |   30 May 2020 8:51 AM GMT
మహేష్ ఏంటి ఇలా ఉన్నాడు...?
X
డబ్బూ రత్నాని.. ఈ పేరు అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఉన్నవారికి మాత్రం కచ్చితంగా తెలిసే ఉంటుంది. డబ్బూ రత్నాని ఇండియాలో ప్రసిద్ధి చెందిన సెలబ్రిటీ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. ఫిలింఫేర్ ఫెమినా ది మ్యాన్ కాస్మోపాలిటన్ ఓకే ఇండియా లాంటి ప్రముఖ మ్యాగజైన్స్ కవర్ పేజీ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇండియాలోని టాప్ సెలబ్రెటీలను తన కెమెరాలో అందంగా బందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య ప్రముఖ ఫిజికల్ ట్రైనర్ లాయడ్ స్టీవెన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సిక్స్ ప్యాక్‌ తో ఉన్న ఎన్టీఆర్ అన్ సీన్ ఫోటో ఒకటి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. తన లుక్ తో కేక పుట్టించిన ఎన్టీఆర్ ని తన కెమెరాలో భందించింది ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నానే. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోల ఫోటోలను తీసే డబ్బూ రత్నాని ఫోటోగ్రఫీ సిల్వర్ జూబ్లీ సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా స్టార్ హీరోల త్రో బ్యాక్ పిక్స్ షేర్ చేస్తూ వస్తున్నాడు డబ్బూ రత్నాని. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ హృతిక్ రోషన్ అక్షయ్ కుమార్ ఫోటోలను షేర్ చేసిన రత్నాని ఇప్పుడు లేటెస్టుగా సూపర్ స్టార్ మహేష్ బాబు స్టిల్ ఒకటి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసారు. ''అందరికీ మనం ఏమి చెప్పకుండానే అర్థం చేసుకునే ఫ్రెండ్ కావాలి'' అంటూ ఒక డాగ్ ఎమోజీ పెట్టి మహేష్ బాబుకి ట్యాగ్ చేసాడు.

ఈ ఫొటోలో మహేష్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. వైట్ కలర్ టీ షర్ట్ బ్లూ జీన్స్ ధరించిన మహేష్ బాబు ఒక సోఫా మీద స్టైల్ గా కూర్చొని స్టిల్ ఇచ్చాడు. పక్కన ఒక పెట్ డాగ్ కూడా ఉంది. ఈ ఫొటో ఎప్పటిదో తెలియదు కానీ మహేష్ హెయిర్ స్టైల్ మరియు డ్రెస్సింగ్ స్టైల్, అతని లుక్ చూస్తుంటే ఓల్డ్ పిక్ అని అర్థం అవుతోంది. ఇప్పుడు ఈ ఫోటో సూపర్ అంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం మహేష్ ని ఇలా ఎప్పుడు చూడలేదంటూ.. మహేష్ ఉన్నాడు అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. కాగా మహేష్ ఈ ఫొటోలో లుక్ ఇప్పుడు ప్రజంట్ లుక్ చూస్తే ఆయనలో చాలా చేంజ్ ఉందని అభిప్రాయ పడుతున్నారు నెటిజన్స్. ఈ మధ్య మహేష్ బాబు పోస్ట్ చేస్తున్న వీడియోస్ ఫోటోలను చూస్తేనే అర్థం అవుతుంది. కొన్ని ఫోటోలలో మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ కి కూతురు సితార లకి అన్నగా కనిపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే పనిలో ఉన్నాడు. తన కెరీర్లో 27వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకి పరశురామ్ డైరెక్షన్ చేయబోతున్నారు. ఎంబీ ప్రొడక్షన్స్ మరియు మైత్రీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈరోజో రేపో ఈ సినిమాకి సంభందించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.