Begin typing your search above and press return to search.
కేవలం పోస్టర్ల కోసం ఆ ఫోటోగ్రాఫర్?
By: Tupaki Desk | 12 May 2016 5:26 AM GMTఒకవేళ బడ్జెట్ ఎక్కువగా పెట్టేస్తున్నారా లేకపోతే నిజంగానే అవరసరమయ్యి ఖర్చు పెడుతున్నారో తెలియదు కాని.. ఇప్పుడు జూ.ఎన్టీఆర్ తదుపరి సినిమా కోసం ఖర్చుకు మాత్రం వెనుకాడటలేదు మైత్రి మూవీ మేకర్స్ వారు. ఈ సినిమా పోస్టర్లను తయారు చేసే ముందు జరిపే ఫోటో షూట్ కు.. ఇప్పుడు బాంబే నుండి ఓ టాప్ ఫోటోగ్రాఫర్ ను దించుతున్నారు.
ముంబయ్ లో గతంలో నవరతన్ హెయిర్ ఆయిల్ వంటి ప్రాడక్టులకు ప్రింట్ యాడ్స్ షూట్ చేసినప్పుడు.. ఎన్టీఆర్ కు డబూ రత్నాని తో పరిచయం ఏర్పడిందట. కాని మన లోకల్ హైదరాబాదీ టాప్ ఫోటోగ్రాఫర్లు రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తే.. డబూ మాత్రం ఒక్క రోజు షూట్ కి 10 లక్షలు తీసుకుంటాడు. అయినాసరే తన ''జనతా గ్యారేజ్'' తొలి పోస్టర్ల షూట్ కు డబూ రావల్సిందే అన్నాడట జూనియర్. ఇంకేముంది.. ఇతగాడినే దించుతున్నారు నిర్మాతలు. కేవలం ఈ ఒక్క పోస్టర్ల షూట్ కోసమే అతను దిగుతున్నాడు.
అయితే ఇక్కడ ఇలాంటి పెద్ద స్టార్లు అలాంటి డిమాండ్లు చేయడం సహజమే కాని.. మార్కెట్ ను దృష్ట్యా బడ్జెట్ పరిధులును దాని పెరిగిపోకుండా చూసుకుంటూ అలా చేస్తే బెటర్. లేకపోతే సినిమాను 70 కోట్లలో ఫినిష్ చేసి.. దానిని 80 కోట్లకు అమ్మి.. ఎంతమంది స్టార్లు ఫ్లాపు దెబ్బలు తిన్నారో చూశాంగా.. జాగ్రత్త జూనియర్!!