Begin typing your search above and press return to search.

డబూ రత్నాని క్యాలెండర్ 2021 టాప్ 5 స్టార్లు

By:  Tupaki Desk   |   15 Jun 2021 7:30 AM GMT
డబూ రత్నాని క్యాలెండర్ 2021 టాప్ 5 స్టార్లు
X
దేశ‌వ్యాప్తంగా గొప్ప పాపులారిటీ ఉన్న డ‌బూ ర‌త్నానీ క్యాలెండ‌ర్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ప్ర‌తియేటా ఫిబ్ర‌వ‌రి నాటికి ఈ క్యాలెండ‌ర్ అందుబాటులో ఉండేది. కానీ ఈసారి చాలా ఆల‌స్య‌మైంది. క్యాలెండర్ 2021 కొంచెం ఆలస్యం అయినా వార్షిక క్యాలెండర్ తో డ‌బూ తిరిగి వచ్చారు. బాలీవుడ్ తారలు ఆలియాభ‌ట్- సన్నీ లియోన్- విక్కీ కౌషల్- అభిషేక్ బచ్చన్ - విద్యా బాలన్ ఈ సంవత్సరం డబ్బూ క్యాలెండర్ లో కనిపించిన బి-టౌన్ ప్రముఖులు. తారా సుతారియా- విజయ్ దేవరకొండ తొలిసారిగా డ‌బూ క్యాలెండ‌ర్ లోకి అడుగుపెట్టారు. ఆ ఇద్ద‌రి హాటెస్ట్ లుక్ ల‌ను ఆవిష్క‌రించ‌గా అభిమానుల్లో వైర‌ల్ గా దూసుకెళ్లాయి.

ఏస్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని క‌ళాత్మ‌క ఫోటోగ్ర‌ఫీ మాయాజాలం మ‌రోసారి అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంది. ఈ కేలెండ‌ర్ లో తెలుగు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ `బీస్ట్ బాయ్` మోడ్ లో ఒక మోటార్ బైక్ పై స్టైలిష్ గా క‌నిపించ‌గా... తారా సుతారియా లాంగ్ వైట్ ష‌ర్ట్ తో హాట్ గా క‌నిపించింది. ఇక ఇదే క్యాలెండ‌ర్ లో లైగ‌ర్ బ్యూటీ అన‌న్య పాండే కూడా క‌నిపించ‌నుంది. అయితే త‌న ఫోటో ఇంకా రివీల్ కాలేదు.

బాలీవుడ్ తారలు ఆలియాభ‌ట్.. సన్నీ లియోన్ .. విద్యాబాల‌న్ ఫోటోషూట్లు ఎంతో కిక్కిచ్చాయి. స‌న్నీ ఆల్మోస్ట్ ఒక హ్యాట్ ని అడ్డు పెట్టుకుని న‌గ్నంగా ఫోజులివ్వ‌గా.. బాల‌న్ ప్ర‌కృతి సౌంద‌ర్యం న‌డుమ అందంగా ఫోజులిచ్చి క‌నిపించారు. విక్కీ కౌషల్ .. అభిషేక్ బచ్చన్ నెవ్వ‌ర్ బిఫోర్ లుక్ తో అల‌రించారు. ఇక వెట‌ర‌న్ హీరో సైఫ్ ఖాన్ అంతే స్టైలిష్ గా ఈ క్యాలెండ‌ర్ లో క‌నిపించారు.

డబ్బూ తన క్యాలెండర్ తయారీ వెన‌క ప్ర‌త్యేక‌త‌ను ఫోటోల రూపంలో పంచుకున్నారు. డ‌బూ ఆలియాతో క‌లిసి ఫోటో దిగి దానిని షేర్ చేశారు. దేవ‌ర‌కొండ‌తో క‌లిసి బైక్ పై ఫోజులిచ్చిన డ‌బూ ఫోటోలు వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. త్వ‌ర‌గా క్యాలెండ‌ర్ 2021ని రెడీ చేయాల‌ని భావించినా మంచి క్ష‌ణం కోసం తాను వేచి చూసాన‌ని డ‌బూ ఈ సంద‌ర్భంగా వెల్లడించారు. క్యాలెండర్ ను ప్రారంభించడానికి పార్టీ లేదా వేడుక‌ ఏదీ ఉండ‌ద‌ని కూడా ఆయన అన్నారు. ముంబై మ‌హారాష్ట్ర‌లో కోవిడ్ నెమ్మ‌దించ‌డంతో ఇటీవ‌ల సెల‌బ్రిటీలు షూటింగుల‌కు వెళుతున్న సంగ‌తి తెలిసిందే. అమితాబ్ స‌హా ప‌లువురు స్టార్లు ఇప్ప‌టికే షూటింగులు ప్రారంభించారు.