Begin typing your search above and press return to search.

బాబు గారి రెండో బాణం?!

By:  Tupaki Desk   |   4 Nov 2018 7:42 AM GMT
బాబు గారి రెండో బాణం?!
X
ద‌శాబ్ధాల చ‌రిత్ర ఉన్న సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్. మూవీ మొఘ‌ల్ .. లెజెండ్ రామానాయుడు ప్రారంభించిన ఈ బ్యాన‌ర్‌ ని త‌న‌యుడు - అగ్ర‌నిర్మాత డి.సురేష్‌ బాబు గొప్ప‌గా మలిచారు. ఈ బ్యాన‌ర్ చేప‌ట్టిన‌ది ఏదైనా పండు అవ్వాల్సిందే అన్నంత గొప్ప‌ పేరు తెచ్చారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో ఎన్నో బ్లాక్‌ బ‌స్ట‌ర్లు వ‌చ్చాయి. నిర్మాత‌గా - పంపిణీదారుగా - ఎగ్జిబిట‌ర్‌ గా - స్టూడియో వోన‌ర్‌ గా సుదీర్ఘ అనుభ‌వంతో ఆయ‌న టాలీవుడ్‌ లో సుదీర్ఘంగా విజ‌య‌వంత‌మైన‌ ఆట సాగించారు. అందుకే ఆయ‌న సంధించే బాణం ఎలా ఉండాలి? అంటే.. సూటిగా గోల్‌ ని చేధించాలి క‌దా? ప‌్ర‌స్తుతం ఇదే సంగ‌తిపై ఫిలింస‌ర్కిల్స్‌ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇంత‌కీ డి.సురేష్‌ బాబు సంధించిన రామ‌బాణం ఏది? అంటే పెద్ద కుమారుడు రానా అని ట‌కీమ‌ని చెప్పేస్తాం. అవును అది నిజ‌మే.. హీరో రానా ప్ర‌స్తుతం టాలీవుడ్‌ లోనే బిగ్ ఛాలెంజ‌ర్‌. తాత‌ - తండ్రిలా నిర్మాత అవుతాడ‌నుకుంటే.. అనుకోకుండా హీరో అయ్యి - రాజ్య‌మేలేస్తున్నాడు. కేవ‌లం టాలీవుడ్‌ లోనే కాదు.. యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుని ఇండియా లెవ‌ల్లో చాకిరేవు పెట్టేయాల‌న్న క‌సితో దూసుకుపోతున్నాడు. బాహుబ‌లి - ఘాజీ చిత్రాల‌తో ఆ లెవ‌ల్ త‌న‌కు ద‌క్కింది. విల‌క్ష‌ణ‌మైన ఎంపిక‌ల‌తో త‌న‌ని తాను రియ‌ల్ ఛాలెంజర్‌ గా మ‌లుచుకున్న రానా గురించి జాతీయ స్థాయిలో చ‌ర్చ సాగుతోంది. `హాథీ మేరా సాథీ` బ‌హుభాషా చిత్రంతో మ‌రోసారి ఆ లెవ‌ల్లోనే పేరు రావ‌డం ఖాయ‌మ‌న్న అంచ‌నాలున్నాయి.

ఇక‌పై కేవ‌లం రానా గురించే కాదు.. డి. సురేష్‌ బాబు సంధిస్తున్న ఈ రెండో బాణం గురించి జాతీయ స్థాయిలో చ‌ర్చ సాగ‌డం ఖాయం. ఇంత‌కీ ఈ రెండో బాణం ఎవ‌రు? అంటే .. ఇంకెవ‌రు ద‌గ్గుబాటి అభిరామ్. రానా సోద‌రుడు. అభిరామ్ ఎంత అల్ల‌రి క‌న్న అయినా.. తాత అడుగుజాడ‌ల్లో ఫిలింప్రొడ‌క్ష‌న్‌ పై ప‌ట్టున్న‌వాడు. ల‌ఘు చిత్రాలు తీశాడు. సినిమా 24 శాఖ‌ల‌పై అవ‌గాహ‌న కోసం అన్ని కోణాల్లో స్ట‌డీ చేశాడు. తాత రామానాయుడు జీవించి ఉన్న‌ప్పుడు త‌న‌తో క‌లిసి ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాలు చూసేవాడు ద‌గ్గుబాటి అభిరామ్‌. ఆన్ లొకేష‌న్ విశేష అనుభ‌వం ఘ‌డించాడు. అయితే ఊహించ‌ని రీతిలో ఇటీవ‌లే వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్ అయ్యాడు. న‌టి శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారంలో బ్యాడ్‌ నేమ్ వ‌చ్చింది. అయితే అదంతా ఆక‌తాయి త‌న‌మే.. కుర్ర‌త‌నమేన‌ని అంతా స‌రిపెట్టుకున్నా జాతీయ స్థాయిలో డిబేట్ అవ్వ‌డంతో ర‌చ్చ‌య్యింది. అందుకే అన్నిటికీ ఒక‌టే స‌మాధానం.. తాను నిర్మాత‌గా నిరూపించి తాత‌ - తండ్రి పేరు నిల‌బెట్ట‌డం. అన్న‌ను మించినవాడు.. ట్యాలెంటెడ్‌ ఎంట‌ర్‌ ప్రెన్యూర్ అని నిరూపించ‌డం ఇప్పుడు అత్యావ‌శ్య‌కం. అందుకే యువ‌నిర్మాత‌గా మంచి పేరు తెచ్చుకునే ప్లాన్‌ ని అభిరామ్ సెట్ చేశాడు. ఇందులో తొలి అతిపెద్ద అడుగు ది గ్రేట్ మ‌ల‌యాళ సూప‌ర్‌ స్టార్ మోహ‌న్ లాల్ న‌టిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `ఓడియ‌న్‌`ని తెలుగులో త‌నే నిర్మాత‌గా రూప‌క‌ల్ప‌న చేసి రిలీజ్ చేయ‌డం.. అందుకు సంబంధించిన రైట్స్‌ ని కొనుక్కున్నాడు. వేరొక యువ‌నిర్మాత సంప‌త్ కుమార్‌ తో క‌లిసి ద‌గ్గుబాటి క్రియేష‌న్స్ పేరుతో ఓడియ‌న్ తెలుగు రిలీజ్ హ‌క్కుల్ని అభిరామ్ ఛేజిక్కించుకున్నాడు. డిసెంబ‌ర్ 14న ఈ చిత్రం మ‌ల‌యాళ వెర్ష‌న్ రిలీజ‌వుతోంది. దాంతో పాటే అన్ని భాష‌ల్లోనూ సైమ‌ల్టేనియ‌స్‌ గా రిలీజ్ చేస్తున్నార‌ట‌. ఈ సినిమా హిట్ట‌యినా అవ్వ‌క‌పోయినా - రిలీజ్ వేళ‌ నిర్మాత‌ల స‌ర్కిల్స్‌ లో అభిరామ్ పేరు ప్ర‌ముఖంగా పాపుల‌ర‌వుతుంద‌న‌డంలో సందేహం లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం.. రాయి అయినా ర‌త్న‌మ‌య్యేది క‌ష్టంతోనే.