Begin typing your search above and press return to search.
బిగ్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రెడీ..
By: Tupaki Desk | 26 Jun 2016 5:37 AM GMTసూపర్ స్టార్లు వాళ్లే.. స్టార్లు వాళ్లే.. మీడియం రేంజి హీరోలు వాళ్లే.. అప్ కమింగ్ హీరోలూ వాళ్లే.. మొత్తంగా టాలీవుడ్లో ప్రస్తుతం వారసులదే హవా. బహుశా ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలోనూ టాలీవుడ్లో ఉన్నంతమంది వారసులు ఉండరంటే అతిశయోక్తి ఏమీ కాదు. హీరోల్ని వెండితెరకు పరిచయం చేసే విషయంలో పెద్ద ఫ్యామిలీలన్నీ ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి.
తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఓ కొత్త కథానాయకుడు రాబోతున్నాడు. అతనే అభిరామ్. దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు.. రానా దగ్గుబాటికి తమ్ముడు. మాస్ కమ్యునికేషన్స్ లో మూడేళ్ల కిందట డిగ్రీ పూర్తి చేసిన అభిరామ్.. ఇప్పటికే తండ్రి శిక్షణలో సినిమాలపై అవగాహన పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తాజాగా నటనలోకి రావాలన్న తన కోరికను వెల్లడించాడు అభిరామ్. బాబాయి వెంకటేష్.. అన్న రానాల మాదిరే తాను కూడా నటుడు కావాలనుకుంటున్నట్లు చెప్పాడు అభిరామ్.
ఐతే నటుడిగా ఉంటూనే నిర్మాతగానూ కొనసాగాలని ఉందని అతనన్నాడు. తనకు సరిపోయే కథల కోసం అన్వేషిస్తున్నామని.. సరైన కథ కుదిరాక తాను చేయబోయే సినిమా గురించి వెల్లడిస్తానని అతనన్నాడు. అన్న రానా తనలాగే కండలు పెంచమని చెబుతుంటాడని.. ఐతే అది తన వల్ల కాదని.. తాను తెరమీద మామూలుగానే కనిపిస్తానని చెప్పాడు అభిరామ్. మరి వెంకీ.. రానాల బాటలోనే నటుడిగా అభిరామ్ కూడా రాణిస్తాడేమో చూడాలి.