Begin typing your search above and press return to search.
దగ్గుబాటి వారసుడి టైమొచ్చిందా?
By: Tupaki Desk | 5 Dec 2019 8:46 AM GMTదగ్గుబాటి రామానాయుడు మనవడు దగ్గుబాటి అభిరామ్ నిర్మాతగా ఎంట్రీ ఇస్తాడని పరిశ్రమ వర్గాలు భావించాయి. అయితే అప్పట్లోనే అభిరామ్ కూడా అన్న రానా బాటలోనే హీరో అవుతాడని స్పెక్యులేషన్స్ వేడెక్కించాయి. కానీ ఎందుకనో అభిరామ్ ఇప్పటివరకూ నటుడు కాలేదు.. అలాగని నిర్మాత కాలేకపోయాడు. తేజ దర్శకత్వంలో హీరోగా నటించే అవకాశం ఉందని వినిపించినా ఏదీ ఫైనల్ కాలేదు. ఆ క్రమంలోనే శ్రీరెడ్డి ఎపిసోడ్ తో అభిరామ్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఒక రకంగా చాలాకాలం పాటు తెరవెనక్కి వెళ్లిపోయాడు.
అయితే అదంతా గతం. వర్తమానంలో అభిరామ్ ఏం చేస్తున్నాడు? అంటే .. అడపా దడపా సినిమా ఈవెంట్లలో కనిపించడం తప్ప ఏం చేస్తున్నదీ తేలలేదు. ఇంతకుముందు లఘు చిత్రాల మేకింగ్ లో అనుభవం ఘడించాడని వినిపించింది. తాత గారు దివంగత రామానాయుడు తో కలిసి సెట్స్ లో ప్రొడక్షన్ వ్యవహారాల్ని చక్కదిద్దేవాడు. కానీ నాయుడు గారు లేని ఈ కాలంలో అతడు ఏం చేశాడు? అన్నది మాత్రం సస్పెన్స్.
ఎట్టకేలకు ఇలాంటి డైలమా నడుమ అభిరామ్ సినీ ఎంట్రీ ఖాయమైందన్న వార్త ప్రస్తుతం వేడెక్కిస్తోంది. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అసురన్ రీమేకవుతున్న సంగతి తెలిసిందే. డి.సురేష్ బాబు ఈ రీమేక్ కోసం పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నారు. ఒరిజినల్ లో ధనుష్ రెండు పాత్రలు పోషించాడు. అందులో సీనియర్ పాత్రకు వెంకీని అనుకున్నా.. యువకుడి పాత్రకు వేరొక హీరోని శ్రీకాంత్ అడ్డాల ఎంపిక చేసుకుంటున్నాడని ప్రచారమైంది. అయితే తాజాగా ఆ పాత్రకు అభిరామ్ అయితే బావుంటుందని దగ్గుబాటి కాంపౌండ్ వర్గాలు భావిస్తున్నాయట. అయితే అభిరామ్ ని ఎంపిక చేయాలా వద్దా? అనేది అడ్డాలకే వదిలేయాలని సురేష్ బాబు డిసైడ్ అయ్యారా? లేదూ వెంకీకి తనయుడిగా కనిపించే పాత్రకు అభిరామ్ అయితేనే బావుంటుందని భావిస్తున్నారా? అన్నది ఆయనే చెప్పాల్సి ఉంటుంది.