Begin typing your search above and press return to search.
రానా తమ్ముడికి తొలి సినిమాలోనే ముగ్గురు
By: Tupaki Desk | 21 July 2016 1:30 PM GMTఅదృష్టమంటే రానా తమ్ముడిదే. తొలి సినిమాలోనే ముగ్గురు హీరోయిన్లతో ఆడిపాడబోతున్నాడు. మామూలుగా తొలి సినిమా అంటే చాలా భయాలుంటాయి. టైమింగ్ కుదురుతుందో లేదో - హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఎలా పండుతుందో అంటూ సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే అభిరామ్ విషయంలో దర్శకుడు వంశీ ఏమాత్రం టెన్షన్ పడటం లేదు. మై హూనా అంటూ ఆయనే దైర్య వచనాలు పలుకుతూ ముగ్గురు హీరోయిన్లని ఎంపిక చేసే పనిలో పడిపోయారు. వంశీ ముప్పయ్యేళ్ల కిందట చేసిన లేడీస్ టైలర్ సీక్వెల్ గానే ఫ్యాషన్ డిజైనర్ కథ రాసుకొన్నాడు.
ఆ కథతోనే ఇప్పుడు అభిరామ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దగ్గుబాటి కుటుంబం నుంచి వస్తున్న మూడో హీరో నటించనున్న చిత్రం కావడంతో అప్పుడే ఫ్యాషన్ డిజైనర్ పై అందరి దృష్టీ పడిపోయింది. వంశీ ఎంపిక కరెక్టైనదే. అంతా ఓకే కానీ... రానా తమ్ముడు అభిరామ్ తొలి సినిమాలోనే ముగ్గరు భామలతో ఆడిపాడగలడా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యాక్టింగ్ లో శిక్షణ తీసుకొన్న అభిరామ్ వచ్చే నెలలో మొదలు కానున్న తన తొలి చిత్రం కోసం మరింత ముమ్మరంగా సాధన చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కామెడీ పండించడంపై ఆయన మెలకువలు తెలుసుకొంటున్నట్టు సమాచారం.