Begin typing your search above and press return to search.

నాయుడుగారి గురించి బాబాయ్ అబ్బాయిల ఎమోషన్

By:  Tupaki Desk   |   7 Jun 2019 5:02 AM GMT
నాయుడుగారి గురించి బాబాయ్ అబ్బాయిల ఎమోషన్
X
నిన్న మూవీ మొఘల్ రామానాయుడు గారి బర్త్ డే సందర్భంగా దగ్గుబాటి ఫ్యామిలీ ఆయన జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్వీట్స్ పెట్టింది. ముందు సురేష్ బాబు వెంకీ మామ కొత్త పోస్టర్ ని షేర్ చేస్తూ నాన్న కల ఈ విధంగా నేరవేరిందంటూ చెప్పిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ చాలా ఏళ్ళ క్రితం నాగ చైతన్య సినిమాల్లోకి రాక ముందు ఓ పుట్టిన రోజు సందర్భంగా కేకు తినిపిస్తున్న ఫోటోని షేర్ చేశారు.

అదే పిక్ లో పక్కనే రామానాయుడు గారు ఈ ఇద్దరినీ ఆనందంతో చూసుకోవడాన్ని అందులో గమనించవచ్చు. ఎప్పుడు మీరు మాతోనే ఉంటారని మీ కలను నెరవేర్చే ప్రయత్నం వెంకీ మామ సినిమా ద్వారా చేసామని చెబుతూ తానెంత మిస్ అవుతున్నానో వెంకీ చెప్పిన తీరు టచ్ చేసేలా ఉంది. దాంట్లోనే చాలా టీనేజ్ వయసులో క్యుట్ లుక్స్ తో చైతు లేలేతగా భలే ఉన్నాడు అంటున్నారు ఫాన్స్ మరోవైపు రానా కూడా తాతయ్య గురించి స్పెషల్ ట్వీట్ పెట్టాడు.

రామానాయుడు గారు ఎప్పుడో పాత రోజుల్లో ఓ బులెట్ మీద ఠీవిగా తీయించుకున్న ఫోటోను షేర్ చేస్తూ సినిమాకు ఆయన చేసిన సేవల గురించి ఆయన 83వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబం ఎంత బాద్యతగా ఉందన్న దాని గురించి ఓ పది లైన్లలో వివరించే ప్రయత్నం చేశాడు రానా. నాన్న కంటే ఎక్కువగా తాతనే ప్రేమించే వాడనని చాలా సార్లు చెప్పిన రానా ఇప్పుడీ ట్వీట్ ద్వారా తనకు ఆయన మీద ఎంత ప్రేమ ఉందో మరోసారి చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో పాటు ఇంకో ట్వీట్ లో వెంకీ మామ పోస్టర్ రానా సైతం షేర్ చేశాడు. మొత్తానికి రామానాయుడు గారి జయంతి ఫ్యామిలీకే కాదు అభిమానులకు సైతం ఓ ఎమోషనల్ మెమరీగా నిలిచిపోయింది