Begin typing your search above and press return to search.
శబరిమల వెళ్లొచ్చాక ఫ్యామిలీ అంతా! సురేష్ బాబు చెప్పిన ఎపిసోడ్ వింటే అంతేగా!!
By: Tupaki Desk | 18 July 2021 3:30 PM GMTఅసలు జనం థియేటర్లకు ఎందుకు రారు? ఈ ప్రశ్నకు పరిశ్రమ టాప్ ఎగ్జిబిటర్ డి.సురేష్ బాబు ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రముఖంగా చర్చకు వస్తోంది. అసలు మన కుటుంబం నుంచి ఎవరైనా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తున్నామా? ఫ్యామిలీ సభ్యులను థియేటర్లకు వెళ్లమని పంపిస్తామా? అని ప్రశ్నించిన ఆయన కోవిడ్ మహమ్మారీకి జనం ఎంతగా భయపడుతున్నారో విశ్లేషించిన తీరు ఎంతో ఆసక్తిని కలిగించింది.
ఈ సందర్భంగా ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. తనకు తెలిసిన ఒకాయన శబరిమల వెళుతూ స్నేహితుడిని కూడా పిలిచాడట. వెళ్లొచ్చిన తర్వాత ఆ స్నేహితుడు లబోదిబోమన్నాడు. తనకు కరోనా సోకడమే కాక తన కుటుంబంలో అందరికీ కరోనా సోకింది. దాని పర్యవసానం ఆ కుటుంబం పై చాలా తీవ్రంగా పడింది. బిజినెస్ మొత్తం దెబ్బ తిని పోయింది అంటూ అతడు బోరుమన్నాడు.. అని సురేష్ బాబు అదిరిపోయే ఎగ్జాంపుల్ చెప్పారు. ఇలాంటప్పుడు మన కుటుంబం నుంచి పిల్లలను ట్యూషన్లకు అయినా బయటకు పంపుతున్నామా? మరి జనాల్ని మీరు కుటుంబంతో థియేటర్లకు రండి అని ఎలా చెబుతారు? అంటూ డీటెయిల్డ్ గా తనదైన శైలిలో విశ్లేషించారు.
నిజమే సురేష్ బాబు తన సినిమాల్ని ఓటీటీలకు అమ్ముకుంటే తిడుతున్నారు కానీ.. ఈమాత్రం ఇంగిత జ్ఞానం తిట్టేవాళ్లకు ఉండనక్కర్లేదా? అని ఒక సెక్షన్ ఆయనకే సపోర్టుగా నిలుస్తున్నారు. ఎగ్జిబిటర్ల సౌఖ్యం కోసం థియేటర్లకు జనాల్ని రమ్మనడం న్యాయమేనా? ఆ రంగంలో కొందరి కోసం కోట్లాది మంది భారతీయ జనాల్ని థియేటర్లకు రప్పిస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించగలరా! మొదటి వేవ్ తర్వాత పట్టించుకోకపోవడం వల్లనే సెకండ్ వేవ్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ వేవ్ కి వెల్ కం చెప్పడానికి థియేటర్లు ఫంక్షన్ హాళ్లు టూరిస్ట్ ప్లేసులే కీ హబ్స్ గా మారనున్నాయా? అన్న సందేహాలను రేకెత్తించారు బాబు! ఓటేయడానికి క్యూలైన్ లోకి రమ్మని పిలిచే నాయకులకు .. సినిమా కోసం థియేటర్లకు రమ్మని పిలిచే ఎగ్జిబిటర్లకు బొత్తిగా తేడా లేకుండా పోయిందన్నమాట!!