Begin typing your search above and press return to search.
రివ్యూ: దాగుడుమూత దండాకోర్
By: Tupaki Desk | 9 May 2015 5:32 PM GMTరివ్యూ: దాగుడుమూత దండాకోర్
రేటింగ్: 2.5 /5
తారాగణం: రాజేంద్ర ప్రసాద్, సారా అర్జున్, సిద్దూ, రవి ప్రకాష్, నిత్యాషెట్టి, రఘు కారుమంచి, సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: ఈఎస్ మూర్తి
కథ: ఏఎల్ విజయ్
నిర్మాత: రామోజీరావు
దర్శకత్వం: ఆర్కే మలినేని
ఆల్రెడీ ఒక భాషలో హిట్ అయిన సినిమా.. రామోజీ వంటి ప్రొడ్యూసర్ నిర్మాణంలో... దర్శకుడు క్రిష్ వంటి వ్యక్తి ఆధ్వర్యంలో.. దిల్ రాజువంటి మరో ప్రముఖ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూషన్ లో... వచ్చిన సినిమా అద్భుతంగా ఉండాలి.. అని కోరుకోవడం వింత కాదు. ఇన్ని అరÛతలున్న సినిమా నుంచి ఏదో ఎక్స్ పెక్ట్ చేయడం న్యాయమే. అంచనాలుండటం సహజమే. మరి ''దాగుడు మూత దండాకోర్'' ఆ అంచనాలను అందుకొందా? వీరందరూ కలిసి ఆడించిన దాగుడుమూతల ఆట ఆకట్టుకొందా? అంటే.. ఆట స్లో అయ్యింది.. ఆకట్టుకోవడం కష్టమైంది.. అని చెప్పాలి. తమిళ సినిమా ''శైవమ్''కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా థియేటర్లను ప్రేక్షకులను రప్పించడంలోనే కాదు.. వచ్చిన వారిని అమితంగా ఆకట్టుకోవడంలో కూడా అంతంత మాత్రమైన ప్రదర్శనగానే ఉంది.
కథ:
అనగనగా రాజులపాలెం లోని ఒక రాజుగారు(రాజేంద్ర ప్రసాద్)... ముగ్గురుకొడుకుల్లో ఒకడితో వ్యవసాయం చేయించుకొంటూ ఊరికి పెద్ద దిక్కుగా ఉంటాడు. రాజుగారికి తన గారాల మనవరాలు బంగారం(సారా అర్జున్) అంటే బోలెడంత ప్రేమ. వ్యవసాయం చేసుకొనే ఈ కుటుంబంలోని బంగారం ఇంట్లోని లేగదూడలు, కోళ్లతో అనుబంధాన్నిపెనవేసుకొని ఉంటుంది. ఇలాంటి బంగారానికి నాని అనే కోడిపుంజు బెస్ట్ ఫ్రెండ్. ఇలాంటి నేపథ్యంలో చాలా సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఉండే రాజుగారి పెద్దకొడుకు, చెన్నైలో ఉండే చిన్న కొడుకు.. దుబాయ్ లో ఉండే కూతురు.. వస్తారు. చాన్నాళ్ల తండ్రిదగ్గరకు వచ్చినా వారు ప్రశాంతంగా ఉండలేరు. తమతమ వ్యక్తిగత సమస్యలకు తోడు.. ఇంట్లో అప్పటికప్పుడు తలెత్తే సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. దీనికంతటికీ కారణం అమ్మవారికి మొక్కుచెల్లించకపోవడమే అనే ముసలం పుడుతుంది ఆ ఇంట్లో. ఒక ఆపదలో అమ్మ వారికి కోడిపుంజును బలి ఇస్తామని మొక్కుకొని.. దాని నెరవేర్చుకోకపోవడంతోనే ఇంటికి సమస్యలు అనే భావనకు వచ్చి బంగారానికి ఇష్టమైన కోడిపుంజు నానిని బలి ఇవ్వాలని అనుకొంటారు. ఇంతలోనే నాని కనిపించకుండా పోతుంది. అక్కడ నుంచి అది ఎక్కడ ఉందో వెతకడం ప్రారంభిస్తారు. మరి వరండాలో ఉండాల్సిన కోడిపుంజు ఏమయ్యింది? రాజుగారి కుటుంబీకులు అదిఎక్కడ ఉందో కనుక్కొన్నారా? అమ్మవారికి మొక్కు తీర్చుకోగలిగారా? వారి సమస్యలు తీరాయా? అనేది మిగత కథ.
కథనం:
తమిళ రచయిత ఏఎల్ విజయ్ ఒక చక్కటి పాయింట్ మీద.. చిన్న పాయింట్ మీద.. అల్లు కొన్న కథ నిజంగా సూపర్. సినిమా కథలు అంటే.. వాటి సృజనకు హద్దు ఉండదని.. ఎలాంటి అంశాన్ని అయినా కథగాఅల్లుకోవచ్చని సినిమాను ఇష్టపడే వారందరికీ అర్థం అయ్యేలా చేశాడతను. ఒక పాప.. కోడిపుంజుపై ప్రేమ, దాన్ని బలివ్వడాన్ని ఇష్టపడక.. కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాన్ని తమిళంలో మంచి సినిమాగా రూపొందించాడతను. ఒకవేళ అదే సినిమా ఏ డబ్బింగ్ రూపంలోనో వచ్చి పలకరించి ఉంటే.. సర్ ప్రైజ్ గా ఉండేది. మరి ఇలాంటి సినిమాను రీమేక్ చేయాలనుకోవడం ఒక సాహసం. ఎందుకంటే ఒకసారి పండిన భావోద్వేగాలు మరోసారి పండుతాయనడానికి ష్యూరిటీ లేదు కదా! ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగినట్టుంది.
పేలవంగా సాగే కథనం.. అది కూడా స్లోగా నడుస్తుంది.. ఓవరాల్ గా సీరియల్ చూస్తున్నామనే ఫీలింగ్... ఇదీ ''దాగుడుమూత దండకోర్'' సినిమా ఇచ్చే అనుభూతి. సున్నితమైన కథనం యాంత్రికంగా సాగిపోతూ ఉంటుంది. ఏ ఒక్క సీన్ కూడా టచ్చింగ్ గా అనిపించదు. మిస్సైన కోడి గురించి కథనాన్నిసాగిస్తూ.. ఇంట్లో వాళ్ల మధ్య భావోద్వేగాలను, బంధాలని ఆవిష్కరించాల్సిన కథనం ఎక్కడా అలా సాగలేదు.
కోడిపుంజును పట్టుకొనే కామిక్ కథ గానూ అనిపించదు.. రాజుగారి కుటుంబంలోని వ్యక్తుల మధ్య అనుబంధాన్ని ప్రెజెంట్ చేసినట్టుగానూ నిలవలేదు. ఎంతసేపూ పాప మీద కెమెరాను ఫోకస్ చేసి తన ఫీలింగ్స్ ను ప్రెజెంట్ చేయాలనుకొన్నారు తప్ప.. తెరపై బోలెడు పాత్రలు ఉన్నా.. వాటిని కథలోకి ఇన్ వాల్వ్ చేసే ప్రయత్నాలేవీ జరగలేదు. తమిళ స్క్రిప్ట్ నే యాజిటీజ్ గా ఫాలో అయినా.. పీల్ ను మాత్రం తీసుకురాలేకపోయారు. ఆ మధ్య ఎర్రబస్సు సినిమాలో దాదాపు ఇలానే జరిగింది. తమిళంలో భావోద్వేగ పూరితంగా సాగిన ఆ సినిమా తెలుగులోకి వచ్చాకా చప్పగా మారింది. ఈ దాగుడుమూతలాట కూడా అదే తీరున కొనసాగింది. దాదాపు 120 నిమిషాల సినిమాలో ఏ ఇరవై, పాతిక నిమిషాలో ప్రేక్షకుడిని సినిమా ఆకట్టుకొంటే అదే కష్టం. ఇక పాత్రల ప్రవర్తన.. వివిధ సీన్లలో అవి రియాక్ట్ అయ్యే తీరుతో సీరియళ్లే గుర్తుకొస్తాయి. రీమేక్ రూపంలోనే అయినా ఒక మంచి ప్రయత్నం చేశారు కానీ... అయితే ఆ ప్రయత్నానికి ప్రతిఫలం స్క్రీన్ పై కనిపించలేదు. దీంతో ఆట అర్ధాపర్ధంగానే ఆకట్టుకొంటుంది.
నటీనటులు:
సినిమాకు సీరియల్ లుక్ రావడానికి ఇందులో నటించిన తారగణం కూడా ముఖ్య కారణం అయ్యుండొచ్చు. తెరపై దజను మంది కదులుతుంటారు.. వారం వారం విడుదలయ్యే ప్రతి సినిమాను చూసే వారు కూడా వీరిని గుర్తించడం కష్టం. అదే ఇంట్లో సీరియల్స్ ను చూసే వాళ్లు మాత్రం వాళ్లను సులభంగా ఐడెంటిఫై చేయగలరు. అలాంటి నటీనటులు అంతా.. ఎలాంటి సీన్లలోనైనా సీరియల్ స్థాయి ప్రదర్శననే ఇచ్చారు. స్లోగా సాగే కథనానికి మరింత నీరసంగా మార్చారు. తమిళలో నాజర్ చేసిన పాత్రను రాజేంద్ర ప్రసాద్ పోషించాడు. నటనపరంగా రాజేంద్రుడిని పేరు పెట్టడానికి ఏమీ లేదు కానీ... డెబ్బై యేళ్ల పై బడ్డ వృద్ధుడి పాత్ర హవభావాలను, నడకను ప్రదర్శించడంలో ఎక్కడో కొంత అసహజత్వం ఉందేమో అనిపిస్తుంది. అయితే రాజేంద్రుడికి ఉన్న సీన్లు కూడా తక్కువే. సినిమాలో ప్రధాన పాత్రను పోషించడమే కాదు..అంతో ఇంతో ఆకట్టుకొనేది కూడా బేబీ సారా అర్జున్ మాత్రమే. తమిళంలో కూడా ఈ పాపే ఈ లీడ్ రోల్ ను చేసింది. తెలుగులో కూడా అదే స్థాయి పెర్ఫార్మెన్స్ ను కంటిన్యూ చేసింది. సినిమాకు అంతో ఇంతో ఫీల్ ను తీసుకొచ్చింది.
సాంకేతిక వర్గం:
కొన్ని సీన్లలో అయితే సినిమాను చిత్రీకరించిన కెమెరా నీడ కూడా తెరపై కనిపిస్తుంది! సాయంత్ర వేళల్లో చిత్రీకరించిన సీన్లలో ఏటవాలు కిరణాలతో పడే కెమెరా నీడ తెరపై కనిపిస్తున్న విషయాన్ని కూడా సరిగాగమనించకుండా సినిమాను చుట్టేశారా? అనే సందేహం కలుగుతుంది వాటిని చూసినప్పుడు. సినిమా మొత్తం కనిపించేది కూడా ఐదారు లకేషన్లే. కథ, కథనాల దృష్ట్యా అంతకు మించి అవసరం లేకపోవచ్చు కానీ సినిమా సీరియల్ అయిపోవడానికి ఇది కూడా ఒక ఫ్యాక్టర్. కానీ పల్లెటూరి మధ్య సాగే కథనాన్ని అందంగా ప్రెజెంట్ చేయడంలోసినిమాటోగ్రఫర్ విజయవంతం అయ్యారు. రెండు పాటలూ ప్లెజెంట్ గా సాగిపోతాయి. బీజీఎమ్ తన పాత్రను పోషిస్తున్నట్టుగా సాగిపోతుంది.
చివరిగా...
రణగొణ ధ్వనులు లేకుండా, తీవ్రమైన భావోద్వేగాలేమీ లేకుండా ఒక సినిమా చూడాలనుకుంటే... ఆ ప్రశాంతత మినహా ఎంటర్ టైన్ మెంట్ ను ఆశించకూడదనే కండీషన్ అప్లై!