Begin typing your search above and press return to search.

ఆమె పాత్ర చూస్తే షాక్‌ తినాల్సిందే

By:  Tupaki Desk   |   30 Oct 2015 9:30 AM GMT
ఆమె పాత్ర చూస్తే షాక్‌ తినాల్సిందే
X
కొన్ని నిజాల్ని వినగానే వెంట‌నే న‌మ్మేయ‌లేం! ఔరా .. అలా జ‌రిగిందేంటి? అది నిజ‌మేనా? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తాం. ఓ తెలుగు సినిమాలో అలాంటి స‌ర్‌ ప్రైజ్‌ నే ఇచ్చాడు ప్ర‌కాష్‌ రాజ్‌. బైటి ప్ర‌పంచానికి అతడు ఓ ప‌క్కా జెంటిల్ మ‌న్‌. కానీ ఇంట్లో గ‌దిలోకెళ్లి లాక్ చేసుకున్నాక అత‌డిలోని విశృంఖ‌ల‌త్వం అంద‌రికీ షాకిస్తుంది. అద్దం ముందు న‌గ్నంగా కూచుని త‌న‌ని తాను త‌నివి తీరా చూసుకోవ‌డం వెండితెర‌పై చూసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు డైజెస్ట్ కాలేదు. ప్ర‌కాష్‌ రాజ్ అంత‌టి జెంటిల్మ‌న్ ఇలాంటి క్యారెక్ట‌ర్ చేయ‌డ‌మేంటి? అంటూ విమ‌ర్శ‌లొచ్చాయి. ఏదేమైనా అది గ‌తం.

ఇపుడు బాలీవుడ్‌ లో అలాంటి క్యారెక్ట‌ర్‌ తోనే స‌ర్‌ ప్రైజ్ ఇవ్వ‌బోతోంది డెయిసీ షా. ఈ అమ్మ‌డు జ‌య‌హో సినిమాతో వెండితెర‌పై హొయ‌లు ఒల‌క‌బోసింది. స‌ల్మాన్‌ ఖాన్ ఎంక‌రేజ్‌ మెంట్‌ తో ఈ అమ్మ‌డు లైమ్‌ లైట్‌ లోకి వ‌చ్చింది. ఇప్పుడు స‌ల్మాన్ ప్రోద్భ‌లంతోనే హేట్‌ స్టోరి 3 చిత్రంలో ఓ వివాదాస్ప‌ద క్యారెక్ట‌ర్‌ లో ద‌న్శ‌న‌మివ్వ‌బోతోంద‌ని టాక్‌. ఈ సంగ‌తిని డెయిసీ స్వ‌యంగా చెప్పుకొచ్చింది. నా క్యారెక్ట‌ర్ చాలా ఆశ్చ‌ర్యం క‌లిగించేలా ఉంటుంది. ఇది ఒప్పుకోవ‌డానికే మూడు నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. చివ‌రికి స‌ల్మాన్ ఎంక‌రేజ్ చేయ‌డం వ‌ల్ల ఓకే చెప్పాను... అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే బికినీల‌లో హొయ‌లు పోతూ హీటెక్కించ‌డం నా ఉద్ధేశంలో త‌ప్పేమీ కాదు. న‌ట‌న అంటే త‌పించేవారు ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డ‌తారు అంటూ క్లాస్ తీసుకుంది అమ్మ‌డు. డెయిసీ కొత్త అవ‌తార్ జ‌నాల్లో ఇంట్రెస్ట్ రాజేస్తోంది. ఇదేమైనా ఇల్లీగ‌ల్ కాంటాక్ట్‌ కి సంబంధించిన వ్య‌వ‌హార‌మా? కార్పొరెట్ గుట్టు విప్పే గూఢ‌చ‌ర్య‌మా? స‌స్పెన్స్ వీడాలంటే హేట్‌ స్టోరి 3 రిలీజ‌వ్వాల్సిందే.