Begin typing your search above and press return to search.
'పుష్ప' ఫస్ట్ సాంగ్: ‘దాక్కో దాక్కో మేక’.. వచ్చేసింది పులి..!
By: Tupaki Desk | 13 Aug 2021 5:46 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ''పుష్ప''. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో పుష్పరాజ్ అనే ఊర మాస్ పాత్రలో బన్నీ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ''పుష్ప: ది రైజ్'' పేరుతో ఫస్ట్ పార్ట్ ని 2021 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ‘దాక్కో దాక్కో మేక’ అనే మొదటి పాటను రిలీజ్ చేశారు.
ఇప్పటికే ప్రోమోతో ‘దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’ సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేయగా.. ఈ రోజు శుక్రవారం విడుదలైన ఫుల్ లిరికల్ పాట వీక్షకులను విశేషంగా అలరిస్తోంది. 'వెలుతురు తింటది ఆకు.. ఆకుని తింటది మేక.. మేకను తింటది పులి.. ఇది కదరా ఆకలి.. పులినే తింటది చావు.. చావును తింటది కాలం.. కాలాన్ని తింటాది కాళి.. ఇది మహా ఆకలి..' అంటూ సాగిన ఈ పాటలో ఆకలి కోసం వేటాడేది ఒకటైతే పరుగెత్తేది ఇంకోటి అని చెబుతున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు.
'ఒక జీవికి ఆకలి వేస్తే ఇంకో జీవి ఆయువు తీరాల్సిందే' అంటూ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. సింగర్ శివమ్ తనదైన శైలిలో ఈ పాటను హుషారుగా ఆలపించారు. సాకీని వీఎం మహాలింగం పాడారు. ‘దాక్కో దాక్కో మేక..' సాంగ్ లో పుష్పరాజ్ గా బన్నీ గెటప్ - హావభావాలు చాలా కొత్తగా ఉన్నాయి. ఇక తనదైన స్టైల్ లో పూనకం వచ్చిన వాడిలా ఊగుతూ వేసిన స్టెప్పులు అలరిస్తున్నాయి. దీనికి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ పాటలో అల్లు అర్జున్ లారీ నడపడం.. గంధపు చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తుండటం వంటివి చూపించారు. అల్లు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ఈ పాటకు థియేటర్లలో పునకాలే అని కామెంట్స్ వస్తున్నాయి.
'దాక్కో దాక్కో మేక' సాంగ్ 'పుష్ప' చిత్రంలోని హైలైట్స్ లో ఒకటిగా నిలవనుందని అర్థం అవుతోంది. ఈ ఫస్ట్ సింగిల్ ని ఐదు భాషల్లో విడుదల చేయడం విశేషం. హిందీలో విశాల్ దడ్లాని.. కన్నడంలో విజయ ప్రకాష్.. తమిళంలో బెన్నీ దయాల్.. మలయాళంలో రాహుల్ నంబియార్ ఈ సాంగ్ పాడారు. ఈ చిత్రానికి మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి ఈ చిత్రానికి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు.
'పుష్ప' చిత్రంలో అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - జగపతిబాబు - సునీల్ - రావు రమేష్ - అజయ్ ఘోష్ - అనసూయ భరద్వాజ్ - ధనుంజయ్ - అజయ్ - శత్రు తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నవీన్ యెర్నేని - వై.రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.