Begin typing your search above and press return to search.
తేజ సర్ తిట్టింది ఎందుకో తెలుసా?
By: Tupaki Desk | 11 Aug 2015 5:36 AM GMTతేజ దర్శకత్వంలో హోరాహోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో తెలుగుతెరకి పరిచయమవుతోంది ముంబై మోడల్ దక్ష. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న వేళ దక్ష షూటింగ్ అనుభవాల్ని ఇలా చెప్పుకొచ్చింది.
=ముంబై లో పుట్టాను. బెంగళూరులో పెరిగాను. హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ ఆరంభమే తేజ వంటి సీనియర్ దర్శకుడి సినిమాలో అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. ఆడిషన్ చేసి గంటలోనే నన్ను తన సినిమాకి కథానాయికగా ఎంపిక చేసుకున్నారు తేజ.
=తేజ హిందీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసేప్పట్నుంచి తెలుసు. అతడు దర్శకత్వం వహించిన జయం, నువ్వు-నేను చిత్రాలు చూశాను. బేసిక్ గా అతడి ప్రతిభ గురించి తెలుసు.
=హోరాహోరీ కోసం ప్రత్యేకించి వర్క్ షాప్స్ ఏమీ లేవు కానీ, మాకోసం ఓ ఫిట్‌నెస్ ట్రైనర్ ని అపాయింట్ చేశారు. కసరత్తులు చేసి ట్రిమ్ అయ్యాం.
=మంచో చెడో నా సినిమా కోసం నేనే డబ్బింగ్ చెప్పుకోవాలనుకున్నా. ఆ మాటే తేజతో చెప్పేశాను. ప్రస్తుతం తెలుగు వేగంగా నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నా. వేరొకరి వాయిస్ తో నన్ను తెరపై చూసుకోవాలంటే ఎలర్జీ. అందుకే ఈ ప్రయత్నం.తెలుగు భాష కోసం పాత సినిమాలన్నీ చూస్తున్నా. యాక్సెంట్, డిక్షన్ వాటినుంచే నేర్చుకుంటున్నా.
=తేజ ఆన్ సెట్స్ తిట్టారు అంటే అది మేం బాగా నటించాలనే. ఇంట్లో అమ్మానాన్న, బడిలో టీచర్ ఎందుకు తిడతారో, అదే టైపు తిట్లన్నమాట! ఓసారి షూటింగ్ అయిపోయాక బైట మామూలుగానే ఉంటారు.
=80శాతం షూటింగ్ నీళ్లలోనే. ప్రారంభం కాస్త ఇబ్బందిపడ్డా అలవాటైపోయింది. ఈ సినిమా కోసం ఏకంగా 48రోజులు నీళ్లలోనే నించోబెట్టారు. ఇదో ప్రేమకథా చిత్రం. నా పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది.
=మూడు స్క్రిప్టులు లైన్ లో ఉన్నాయ్. ముందు ఈ సినిమా రిలీజ్ కానివ్వండి. తర్వాత ఇతర వివరాలు చెబుతా.