Begin typing your search above and press return to search.

తండ్రీకొడుకుల‌తో ఆ బ్యూటీ ఆన్ సెట్స్ స‌ర‌దాగా

By:  Tupaki Desk   |   11 Jan 2022 11:30 PM GMT
తండ్రీకొడుకుల‌తో ఆ బ్యూటీ ఆన్ సెట్స్  స‌ర‌దాగా
X
`హోరా హోరి`..`జాంబిరెడ్డి` చిత్రాల్లో న‌టించిన ద‌క్ష‌నాగ‌ర్క‌ర్ సుప‌రిచితురాలే. రెండు చిత్రాలు యావ‌రేజ్ గా ఆడ‌టంతో ఐడెంటిటీ ద‌క్కింది. దీంతో ఏకంగా `బంగార్రాజు` చిత్రంలో ఐట‌మ్ గాళ్ల్ గా ప్ర‌మోట్ అయింది. కింగ్ నాగార్జున‌.. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `బంగార్రాజు` సినిమాలో బ్యూటీ ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించింది. `సొగ్గాడే చిన్నా నాయ‌నా` కి సీక్వెల్ గా తెర‌కెక్కిన సినిమా జ‌న‌వ‌రి 14న భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా `బంగార్రాజు` ఆన్ సెట్స్ లో తండ్రీకొడుకుల‌తో గ‌డిపిన క్ష‌ణాల గురించి గుర్తు చేసుకుందీ బ్యూటీ.

చైత‌న్య తో క‌లిసి తొలిసారి డాన్స్ చేసాను. అత‌ను చాలా కూల్ గ‌య్. పాట కోసం రిహార్స‌ల్స్ చేస్తున్న‌ప్పుడు..నేను స‌రిగ్గా స్టెప్పులు వేసే వ‌ర‌కూ అత‌ను ఎంతో స‌హ‌నంగా ఉండేవారు. స‌ర‌దాగా జోకులు వేసేవారు. ఇక నాగార్జున గారితో చాలా స‌ర‌దాగా ఉంటుంది. ఇద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ‌లు చాలా ఫ‌న్నీగా ఉండేవి. టాటూలంటే అత‌నికి చాలా ఇష్టం. పాములన్నా ఆస‌క్తే. ఇద్ద‌రం వాటి గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. నా నంబ‌ర్ గురించి వ‌స్తే ఇది ఫెస్టివ‌ల్ సాంగ్. రంగు రంగుల సెట్లు.. వేషధార‌న‌ల‌తో సెట్ క‌ళ‌క‌ళ‌లాడుతుంది. ఈ పాట పండుగ వాతావ‌ర‌ణం క‌ల్పిస్తుంది. నా వ‌ర‌కూ బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చాను అనుకుంటున్నాను. మ‌రి ప్రేఓకులు ఎలా రిసీవ్ చేసుకుంటో చూడాలి`` అని తెలిపింది.

దక్ష నగార్కర్ ముందుగా కన్నడ భాష‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆమె 2007లో కన్నడ సినిమా `భూగత` సినిమాతో లాంచ్ అయింది. ఆ త‌ర్వాత‌ 2015లో ‘ఏకే రావు పీకే రావు’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమాతో అమ్మ‌డికి అంత గుర్తింపు రాలేదు. ఆ త‌ర్వాత `హోరా హోరీ`లో న‌టించింది. అటుపై విడుదలైన `జాంబీ రెడ్డి` సినిమా తో తెలుగు నాట ఫేమ‌స్ అయింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ పైనే దృష్టి పెట్టింది. న‌టిగా వ‌చ్చిన అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటుంది.