Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూసివ్ : హ్యాపెనింగ్ హీరోయిన్ దక్ష నగరికర్ తో స్పెషల్ చిట్ చాట్

By:  Tupaki Desk   |   22 May 2020 5:40 AM GMT
ఎక్స్ క్లూసివ్ : హ్యాపెనింగ్ హీరోయిన్ దక్ష నగరికర్ తో స్పెషల్ చిట్ చాట్
X
* హాయ్ దక్ష ఎలా ఉన్నారు?

హాయ్ నేను బావున్నా మీరు బావున్నారా?

* నేను బావున్నా - తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు - ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు?

హుషారు షూటింగ్ నుంచి నేర్చుకుంటున్న - కంపల్సరీగా షూటింగ్ లో కానీ నా స్టాఫ్ - మీడియా అందరితో తెలుగులోనే మాట్లాడాలని ఒక రూల్ పెట్టుకున్నా - దాంతో చాలా త్వరగా ఈ బాషా వచ్చేసింది.

* తెలుగు చదవడం - రాయడం కూడా వచ్చిందా?

లేదు ఇంక అంతా ప్రొఫెషనల్ అవ్వలేదు - కానీ త్వరలోనే నేర్చుకుంటాను

* మీరు నార్త్ అమ్మాయి - ఎందుకని తెలుగులోనే ఫిల్మ్ కెరీర్ ని స్టార్ట్ చేయాల్సి వచ్చింది?

నాకు 18 ఏళ్ళు ఉన్నపుడు మోడలింగ్ లో అడుగుపెట్టాను - సరదాగా ఒక షో లో పార్టిసిపేట్ చేశాను - అలా నా ఫొటోస్ తేజ గారికి ఎవరో సజెస్ట్ చేయడం - వెంటనే అయన డైరెక్షన్ లో వచ్చిన హోరా హోరి లో హీరోయిన్ గా నటించడం చకచక జరిగిపోయాయి. నిజానికి నాకు చిన్నపటి నుంచి హీరోయిన్ అవ్వాలని కోరిక ఉండేది - ఆ ఉద్దేశంతోనే వెంటనే తేజ గారి ఆఫర్ కి ఓకే చెప్పాను, - కానీ ఆ సినిమా ప్లాప్ అవ్వడం - ఇంట్లో వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి ఆ తరువాత మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేయమని చెప్పడంతో హోరా హోరి అవ్వగానే సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టి డిగ్రీ పూర్తి చేసి - ఆ తరువాత హుషారుతో మళ్ళీ ఫిల్మ్ కెర్రిర్ ని రీస్టార్ట్ చేశాను. హైదరాబాద్ ఇప్పుడు నా సొంత ఊరులా అనిపిస్తుంది. తెలుగు వాళ్లు చూపించే లవ్ అండ్ అఫెక్షన్ నాకు చాలా ఇష్టం.

* ఫిల్మ్ కెరీర్ ని రే స్టార్ట్ చేసినప్పుడు - కొత్త వాళ్ళతో - చిన్న సినిమాలో నటిస్తున్నా అని అనిపించలేదా?

కథ నాకు నచ్చితే చిన్న పెద్ద అని తేడా లేకుండా సినిమాలు చేయడానికి నేను రెడీ. హుషారు కథ విన్నప్పుడు - నా క్యారెక్టర్ గురించి రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఎందుకో ఈ సినిమా హిట్ అవుతుంది అని అనిపించింది. ఆ గట్ ఫీలింగ్ తోనే నా రీ లాంచ్ సినిమాగా హుషారు ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.

* ఇండస్ట్రీ లో మీకు ఎదురైనా బిట్టర్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పండి?

పెద్దగా ఏం లేవు కానీ - ఇండస్ట్రీ లో ఎవరు కోసం వారే బ్రతకాలి మనకోసం ఎవరు వచ్చి ఏది చేయరు అని తెలుసు కున్నాను. నాకు మంచి ఆఫర్స్ రావాలి అంటే నేనే ట్రై చేయాలి నా తరుపున వేరు ఎవరు నా పని చేయడానికి సిద్ధంగా ఉండరు అని ఫిక్స్ అయ్యాను.

* సినిమాలేనా ఓటిటి ల వైపు వెళ్లే ఆలోచనలు ఉన్నాయా?

ఎందుకు సినిమాని - ఓటిటి లను వేరుగా చేస్తున్నారో అర్ధం కావడం లేదు - ఓటిటి కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే దానికి సినిమా వాళ్లే కావాలి. ఒక రెగ్యులర్ సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో ఓటిటి లకు అలానే జరుగుతుంది. ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడం ప్రతి ఆర్టిస్ట్ భాద్యత. ఇక నా వరకు చాలా వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయమని ఆఫర్స్ వచ్చాయి. కానీ ఒక సాలిడ్ స్టోరీ కోసం నేను వెయిట్ చేస్తున్నా.

* మీ అప్ కమింగ్ ప్లాన్స్ ఏంటి?

బెల్లంకొండ గణేష్ (నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో తనయుడు) డెబ్యూ మూవీ లో నటిస్తున్నా. అలానే కల్కి ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఇంకో మూవీ చేస్తున్నా. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఈ మధ్యనే ఒక స్టోరీ చెప్పింది. దానికి సంబందించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి.

* మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవ్వి మీరు మరింతగా తెలుగు ఆడియన్స్ కి దగ్గర అవ్వాలని తుపాకీ డాట్ కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్

* తుపాకీ రీడర్స్ అందరు స్టే హోమ్ సేఫ్