Begin typing your search above and press return to search.

ర‌వితేజ కోసం విల‌న్‌గా మారుతున్న హాట్‌ లేడీ

By:  Tupaki Desk   |   5 Jan 2022 12:37 PM GMT
ర‌వితేజ కోసం విల‌న్‌గా మారుతున్న హాట్‌ లేడీ
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన హై వోల్టేజ్ మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `క్రాక్‌`. ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో మాస్ రాజా ర‌వితేజ మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేశారు. ఈ మూవీ త‌రువాత ఆయ‌న అన్ స్టాప‌బుల్ అన్న‌ట్టుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ని ప్ర‌క‌టిస్తూనే వున్నారు. ఇప్ప‌టికీ ఆయ‌న ప్ర‌క‌టించిన సినిమాలు ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు, ధ‌మాకా, రావ‌ణాసుర‌.. ఈ చిత్రాల్లో ఇప్ప‌టికే రెండు చిత్రాలు షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి.

ఇందులో సుధీర్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్న `రావ‌ణాసుర‌` జ‌న‌వ‌రి 14న లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రంలో ర‌వితేజ లాయ‌ర్ గా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. `హీరోస్ డోన్ట్ ఎగ్జిస్ట్‌` అనే క్యాప్ష‌న్ తో ర‌వితేజ‌ని విభిన్న‌మైన పాత్ర‌లో చూపించ‌బోతున్న ఈ మూవీని అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అభిషేక్ నామా నిర్మించ‌బోతున్నారు.

ఇందులో ఓ ప‌వ‌ర్ ఫుల్ లేడీ విల‌న్ పాత్ర వుంద‌ట‌. ఆ పాత్ర కోసం హాట్ లేడీ ద‌క్షా నాగ‌ర్‌కర్ ని ఫైన‌ల్ చేసిన‌ట్టుగా తెలిసింది. ఇందులో ఆమె పాత్ర హైలైట్ గా నిల‌వ‌నుంద‌ని చెబుతున్నారు. ప్ర‌శాంత్ వ‌ర్మ రూపొందించిన `జాంబీరెడ్ది` మూవీలో ద‌క్ష న‌టించిన విష‌యం తెలిసిందే. ఆ మూవీ త‌రువాత మ‌రో ఆఫ‌ర్ ని ద‌క్కించుకోని ఈ హాట్ బ్యూటీ మాస్ రాజా కోసం విల‌న్ అవ‌తారం ఎత్త‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

సినిమాలో త‌న పాత్ర నచ్చ‌డంతో నెగెటివ్ రోల్ కి ద‌క్షా నాగ‌ర్‌క‌ర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా చెబుతున్నారు. ఇందులో ర‌వితేజ తో ముగ్గురు హీరోయిన్ లు రొమాన్స్ చేయ‌నున్నార‌ట‌. వారు ఎవ‌రన్న‌ది ఇంకా ఫైన‌ల్ కాలేదు. సంక్రాంతి రోజున వారికి సంబంధించి అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం వుంది. గ్లామ‌ర్ డాల్ గా హాట్ హాట్ అందాల‌తో ఆక‌ట్టుకున్న ద‌క్షా నాగ‌ర్‌క‌ర్ లేడీ విల‌న్ గా `రావ‌ణాసుర‌`లో ఏ రేంజ్ లో మెస్మ‌రైజ్ చేస్తుందో చూడాలి.