Begin typing your search above and press return to search.
రేప్ సీన్ లో చెంప పగులగొట్టిన సీనియర్ నటి
By: Tupaki Desk | 25 Nov 2022 4:30 AM GMTఒక సున్నితమైన సన్నివేశంలో నటి జయప్రద తనను చెంపదెబ్బ కొట్టిందనే పుకార్లు ఇప్పటికీ తనను ఎలా వెంటాడుతున్నాయో దలీప్ తాహిల్ తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ వార్తలు నిజం కాదని అతడు ఖండించాడు. ఆంఖ్రీ రాస్తా సెట్స్ లో జయప్రద తనను చెంపదెబ్బ కొట్టినట్లు వచ్చిన ఆరోపణలను దలీప్ కొట్టి పారేసారు. రేప్ సన్నివేశంలో నియంత్రణ కోల్పోయిన తర్వాత ఆమె తనను చెంపదెబ్బ కొట్టినట్లు వార్తలు ఇప్పటికీ గూగుల్ లో చదువుతూనే ఉన్నానని సీనియర్ నటుడు దలీప్ తాహిల్ అన్నారు.
అవన్నీ పుకార్లు... దీనిని ప్రారంభించిన వ్యక్తిపై నాకు ఎలాంటి పగ లేదని తహిల్ అన్నారు. ఆంఖ్రీ రాస్తాకు కె భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. జయప్రద - దలీప్ లతో పాటు అమితాబ్ బచ్చన్- శ్రీదేవి - అనుపమ్ ఖేర్ నటించారు. ఈ సినిమా షూటింగ్ లో జయతో ఓ సన్నివేశంలో నటించమని దలీప్ ని కోరారట. కానీ అతడు మొదట నిరాకరించాడు.
కానీ కెరీర్ గురించి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ సన్నివేశానికి జయప్రద సమ్మతించారని.. ఆ తర్వాత అంగీకరించాడని కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో జయ దలీప్ ను చెంపదెబ్బ కొట్టడంతో సెట్లో ఒక్కసారిగా సీన్ మారిపోయిందంటూ తనపై లేనిపోని ఆభాండాలు రాసారని అతడు గుర్తు చేసుకున్నారు.
నేను జయప్రదతో రేప్ సీన్ చేశానని చాలా కాలంగా వెబ్ లో చదువుతున్నాను. జయప్రద నన్ను చెంపదెబ్బ కొట్టాక దూరంగా వెళ్లిపోయానని రాసారు. నిజానికి నేను జయప్రదా జీతో ఎప్పుడూ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోలేదు. నేను అవకాశం కోసం ఆసక్తిగా ఉన్నాను కానీ రాలేదు. అలాంటి సీన్ ఎప్పుడూ చేయలేదు. రాసే వ్యక్తిపై నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. ఈ వ్యక్తి నాకు ఈ దృశ్యాన్ని చూపించాలని కోరుకుంటున్నాను. ఇటీవల సోషల్ మీడియాల్లో ఎప్పుడూ లేని పరిస్థితులను సృష్టిస్తున్నారు. అలాంటి సన్నివేశం ఎప్పుడూ నేను చేయలేదు`` అని అన్నారు.
దలీప్ తాహిల్ బాజీగర్ (1993) రాజా (1995) హమ్ హై రాహీ ప్యార్ కే (1993) ఖయామత్ సే ఖయామత్ తక్ (1988)- కహో నా ప్యార్ హై (2000)- అజ్ఞాతవాసి (2001)- వంటి 100కి పైగా చిత్రాలలో నటించాడు. రాక్ ఆన్!! (2008)- రా.వన్ (2011)- భాగ్ మిల్కా భాగ్ (2013)-మిషన్ మంగళ్ (2019) చిత్రాల్లోను నటించాడు. అతను రాజ్ కుమార్ రావు - సన్యా మల్హోత్రాతో కలిసి HIT: ది ఫస్ట్ కేస్ లో చివరిగా కనిపించాడు. అతను మైండ్ ది మల్హోత్రాస్ సీజన్ 2లో కూడా నటించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.