Begin typing your search above and press return to search.

అప్పుడే ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ ప్రకంపనలు

By:  Tupaki Desk   |   5 Jun 2019 5:26 AM GMT
అప్పుడే ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ ప్రకంపనలు
X
ఇంకా పట్టుమని పాతిక శాతం షూటింగ్ కూడా పూర్తి కాలేదు అప్పుడే ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ సంచలనాలకు వేదికగా మారుతోంది. సుమారు 300 కోట్లతో తెలుగులోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాగా ఆర్ ఆర్ ఆర్ మీద అంచనాలు ఆకాశమే హద్దుగా సాగుతున్నాయి. విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే నిర్మాత దానయ్య మీద ట్రేడ్ నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తోంది. రకరకాల ఆఫర్లతో ఆయన్ని ముంచెత్తుతున్నారట.

ఎలాగూ రిలీజ్ డేట్ వచ్చే ఏడాది జూలై 31 ఫిక్స్ చేశారు కాబట్టి ఆ మేరకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని వాళ్ళ ప్లాన్. ఇదిలా ఉండగా ఓవర్సీస్ కు సంబంధించి ఓ క్రేజీ డీల్ ని దానయ్య రిజెక్ట్ చేశారని తాజా సమాచారం. కారణం ఆశించిన మొత్తం అది సుమారు పది కోట్ల దాకా తక్కువగా ఉండటమేనట. సాహో కొన్న సంస్థనే సుమారు 65 కోట్ల దాకా ఆఫర్ ఇస్తే దానయ్య ఇంకో పది అదనంగా 75 దాకా ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టు చెప్పారట. ఇది ఖరారుగా తెలియదు కాని ఫిలిం నగర్ టాక్ అయితే జోరుగా ఉంది.

రాజమౌళి మాత్రం తొందరపడకండని చాలా టైం ఉంది కాబట్టి ఫస్ట్ లుక్ లేదా టీజర్ రిలీజయ్యాక ఇంతకు ఎక్కువ మొత్తమే ఆఫర్ చేస్తారని అప్పటి దాకా వెయిట్ చేయమని దానయ్యతో చెప్పారట. అందుకే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని ఆఫర్లు ఫోన్ కాల్స్ వస్తున్నా అందరికి ఇంకొంత కాలం వెయిట్ చేయమని దానయ్య సమాధానం ఇస్తున్నట్టు తెలిసింది. ఈ లెక్కన చూసుకుంటే భారీ పెట్టుబడి అని అందరూ రిస్క్ గా భావిస్తున్న 300 కోట్లు చాలా ఈజీగా రిలీజ్ కు ముందే దానయ్య టేబుల్ మీద వచ్చి పడేలా ఉన్నాయే