Begin typing your search above and press return to search.
అప్పు ఎగ్గొట్టారా? ఇంకేదైనా సమస్యనా?
By: Tupaki Desk | 21 Dec 2019 12:53 PM GMTరంగుల ప్రపంచంలో ఆర్థిక వ్యవహారాలు అప్పుడప్పుడు చికాకులు పుట్టిస్తుంటాయి. కోట్లాది రూపాయల పెట్టుబడులు కుమ్మరించే చోట ఇది సహజమే అనుకున్నా కొన్నిసార్లు మాత్రం పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. ఒక్కోసారి మాటా మాటా పెరిగినప్పుడు దాని పర్యవసానం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లాల్సిన సీన్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం అలాంటి సన్నివేశమే ఓ ఇద్దరు నిర్మాతల మధ్య ఎదురైందట. ఫలితంగా అప్పు ఇచ్చిన నిర్మాత తనవద్ద అప్పు తీసుకున్న వ్యక్తి పద్ధతి బాలేదంటూ పోలీస్ గడప తొక్కారని తెలుస్తోంది.
అయితే ఇది ఇప్పటి గొడవ కాదు. చాలా కాలంగా నలుగుతున్నదే. ఎప్పుడో అప్పు ఇచ్చారు. ఇదిగో తీరుస్తున్నా అదిగో తీరుస్తున్నా అంటూ అవతలి నిర్మాత ఆలస్యం చేశారట. ఇంతకీ అప్పు ఎంత? అంటే రూ.80లక్షల మేర అప్పు చెల్లించాల్సి ఉందట. మొండి బకాయిని తీర్చమని అడిగితే అట్నుంచి రూడ్ గా సమాధానం వచ్చిందిట. దీంతో సదరు నిర్మాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ వివాదం వాగ్వాదం జరిగింది పెద్ద స్థాయి నిర్మాతలు కాబట్టి అది కాస్తా హాట్ టాపిక్ గా మారింది. అసలింతకీ ఆ ఇద్దరూ ఎవరు? అంటే..
RRR నిర్మాత డీవీవీ దానయ్య తన అప్పు చెల్లించలేదంటూ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై పోలీస్ కేసు పెట్టారని తెలుస్తోంది. ఏళ్లతరబడి తనకు చెల్లించాల్సిన 80లక్షలు చెల్లించలేదన్నది ఆయన ఆరోపణ. పైగా అడిగితే ఆయన రూడ్ గా మాట్లాడారని ఆరోపిస్తూ పోలీసుల్ని ఆశ్రయించారట. వందల కోట్ల బడ్జెట్లతో సాహసాలు చేసే నిర్మాతలకు ఇదేమంత పెద్ద మొత్తమా? అంటే.. కానే కాదు. మాట తీరుతోనే చిక్కొచ్చిందో ఏమో ఇది కేవలం ఈగో సమస్య మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ గొడవ విషయంలో ఫిలింఛాంబర్ - నిర్మాతల మండలిలో పరిష్కారం కోరతారా? అన్నది చూడాలి.