Begin typing your search above and press return to search.
నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: సాయిపల్లవి!
By: Tupaki Desk | 27 Oct 2021 11:30 AM GMTఒకప్పటి హీరోయిన్లకు జిమ్ అంటే ఏమిటో తెలియదు. అయినా వాళ్లు ఎంతో అందంగా .. మరెంతో నాజూకుగా కనిపించేవారు. అలా వాళ్లు తమ గ్లామర్ ను కాపాడుకుంటూ వందల సినిమాలే చేశారు. కానీ ఇప్పటి హీరోయిన్లు ఉంటే సెట్లో .. లేదంటే జిమ్ లో అన్నట్టుగా ఉంటున్నారు. మంచి బాడీ షేప్ కోసం .. నాజూకుదనం కోసం వాళ్లు చేసే కసరత్తు అంతా ఇంతా కాదు. ఈ మధ్య జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఆ వీడియోలను రిలీజ్ చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. రకుల్ .. రాశి కన్నా .. రష్మిక వీళ్లంతా ఎక్కువగా జిమ్ లో ఉండేవారే.
కానీ సాయిపల్లవి మాత్రం ఇంతవరకూ జిమ్ కి వెళ్లలేదట .. అసలు ఇంతవరకూ జిమ్ నే చూడలేదట. ఈ విషయం ఎవరో చెబితే ఎవరు మాత్రం నమ్ముతారు? అందుకే సాయిపల్లవినే స్వయంగా చెప్పింది. "సినిమాల్లోకి రావడానికి ముందుగానీ .. ఆ తరువాత నేను జిమ్ కి వెళ్లలేదు. అసలు జిమ్ ఎలా ఉంటుందో కూడా నేను నేరుగా చూడలేదు. నేను ఎప్పుడూ వర్కౌట్లు చేసింది లేదు .. నాకు తెలిసింది డాన్స్ మాత్రమే .. అదే చేస్తుంటాను. స్ట్రెస్ ఫీలైనప్పుడు .. ఖాళీ దొరికినప్పుడు .. షూటింగు గ్యాపులోను నేను డాన్స్ ఎక్కువగా చేస్తుంటాను.
ఎక్స్ పర్ట్స్ కూడా వర్కౌట్స్ చేయడం కంటే, డాన్స్ చేయడం మంచిదనే చెప్పారు. అరగంట సేపు డాన్స్ చేయడం వలన 400 కేలరీలు ఖర్చు అవుతాయట. మంచి ఫిట్ నెస్ కోసం .. బాడీ షేప్ కోసం డాన్స్ కి మించినది లేదనేది నా ఉద్దేశం. అందువల్లనే నేను ప్రతిరోజు నేను డాన్స్ చేస్తూనే ఉంటాను. ఎలాంటి పరిస్థితుల్లోను డాన్స్ విషయంలో అశ్రద్ధ చేయను. నా ఫిట్ నెస్ రహస్యం కూడా అదే" అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు మిగతా హీరోయిన్లంతా డాన్స్ బాట పడతారో ఏమో.
ప్రస్తుతం సాయిపల్లవి 'లవ్ స్టోరీ' హిట్ ను ఎంజాయ్ చేస్తోంది. ఆమె నుంచి 'విరాటపర్వం' సినిమా రానుంది. రానా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయనను ఆరాధించే గ్రామీణ యువతిగా ఆమె కనిపించనుంది. నక్సలిజం నేపథ్యంలో ఈ కథ నడవనుంది. ఇక ఆ తరువాత సినిమాగా ఆమె 'శ్యామ్ సింగ రాయ్'తో పలకరించనుంది. ఈ సినిమాలో కలకత్తా నేపథ్యంలో దసరా నవరాత్రి ఉత్సవం సందర్భంగా సాయిపల్లవి చేసే క్లాసికల్ డాన్స్ ఒకటి ఉందట. ఈ పాట .. ఈ డాన్స్ కూడా సాయిపల్లవికి మరింత పేరు తెచ్చిపెడతాయని అంటున్నారు.