Begin typing your search above and press return to search.
ఊర్వశీ ఊర్వశీ.. కొత్త వెర్షన్ విన్నారా?
By: Tupaki Desk | 28 Feb 2017 10:23 AM GMT90ల్లో సౌత్ సినిమాల్ని ఫాలో అయిన వాళ్లెవ్వరూ కూడా ‘ప్రేమికుడు’ సినిమాలోని ఊర్వశీ ఊర్వశీ పాటను మరిచిపోలేరు. అప్పట్లో యూత్ ను ఒక ఊపు ఊపేసింది ఆ పాట. ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచిన ఆ పాటకు ఇప్పుడు కొత్త వెర్షన్ వచ్చింది. ఐతే అది సరదాకు చేసిన ప్రయత్నం కాదు. దేశంలో మహిళల మీద అఘాయిత్యాలు.. అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇదేనా మహిళా సాధికారత అంటూ ప్రశ్నిస్తూ ఈ పాట సాగుతుంది. ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. వారికి ఎదురవుతున్న సవాళ్ల మీద సమర శంఖం పూరిస్తూ ‘బ్రేక్ త్రూ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పాటను రూపొందించింది.
ఊర్వశీ ఊర్వశీ.. ఇట్స్ ఆల్ బుల్ షిట్ ఊర్వశీ.. యే సొసైటీ పేట్రియార్కీ నహీ చాహియే ఊర్వశీ.. అంటూ సాగే ఈ పాటలో కొన్ని ఆలోచనాత్మకమైన.. హార్డ్ హిట్టింగ్ లైన్స్ ఉన్నాయి. ఈ దేశంలో రుద్రమదేవికి విగ్రహం ఉంది కానీ.. సీతకు లేదని.. కాబట్టి పోరాటమే సరైన మార్గం అని ఇందులో మహిళలకు హిత బోధ చేసే ప్రయత్నం చేశారు. అమ్మాయిల్ని సంప్రాదాయాలు.. కట్టుబాట్ల పేరుతో ఎలా అణగదొక్కేస్తున్నారో కూడా ఇందులో చెప్పారు. ఫెమినిస్ట్ రీమిక్స్ ఆఫ్ ఊర్వశీ పేరుతో ఈ పాటను రిలీజ్ చేశారు. అమ్మాయిలు ఈ రీమిక్స్ సాంగ్ తో బాగా కనెక్టవుతున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/