Begin typing your search above and press return to search.

బాప్ రే.. బీచ్ ని మ‌రిగించిన నోరా వైర‌స్

By:  Tupaki Desk   |   15 Oct 2022 3:54 AM GMT
బాప్ రే.. బీచ్ ని మ‌రిగించిన నోరా వైర‌స్
X
డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి గురించి పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఇత‌ర నాయిక‌ల‌తో పోలిస్తే చాలా స్పీడ్ గా ఉంటుంది. తరచుగా తన అందమైన ఫోటోలు వీడియోలతో నెటిజనుల‌కు కావాల్సిన ట్రీటిస్తూనే ఉంది. ఇటీవల నోరా తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో తన డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో నోరా ఒక బీచ్ లో తన గై గ్యాంగ్ తో కలిసి హీటెక్కించే బీట్ కి డ్యాన్స్ చేస్తూ క‌నిపించింది. మ‌నోహ‌రి ఎప్పటిలాగే అందంగా కనిపించింది.

నోరా ఫతేహి చిస్ బ్రౌన్ లేటెస్ట్ సాంగ్ 'కాల్ మి ఎవ్రీ డే ఇన్ మారిషస్..' కి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఆమె స్నేహితులు రజిత్ దేవ్ - మేకప్ ఆర్టిస్ట్ మార్స్ పెడ్రోజో కూడా చేరారు. నోరా బీచ్ లోని ట్రాక్ కోసం తన సాధారణ శైలిలో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. ఆకట్టుకునే ఈ డ్యాన్స్ వీడియోకి 'వైబింగ్ …ప్రతిరోజూ కాల్ చేయండి'అని క్యాప్ష‌న్ ని ఇచ్చింది.. వీడియోలో నోరా పింక్ బీచ్ బ్రా- డెనిమ్ మినీ షార్ట్‌లను ధరించి కనిపించింది. త‌న పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేయ‌గానే చాలా మంది గుండె -ఫైర్ ఎమోజీలను షేర్ చేసారు.

అందాల నోరా డ్యాన్స్ స్కిల్స్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆమె ఎక్కడైనా డ్రమ్స్ రోల్ విన్నా.. పాప్ బీట్ విన్నా వెంట‌నే నాగిని నృత్యంతో వెస్ట్ర‌న్ స్టైల్ డ్యాన్స్ ల‌తో క‌ట్టి ప‌డేస్తుంది. బీచ్ లో నోరా ఫతేహి డ్యాన్సుల‌కు వీక్ష‌కులు కూడా జాయిన‌య్యేంత స్ఫూర్తిని నింపింద‌ని చెప్పాలి.

ఇంత‌కీ ఇది ఏ బీచ్ అంటే? థాయ్‌లాండ్ లోని ఉష్ణమండల బీచ్ ఇది.
నోరా ఎల్ల‌పుడూ బీచ్ గాలిలో డ్యాన్స్ చేయడాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటుందని మ‌న‌కు తెలుసు. గత సంవత్సరం నోరా ఫతేహి 'వన్ డ్యాన్స్' ఛాలెంజ్‌ని స్వీకరించినప్పుడు ఇంటర్నెట్ లో యువత‌రం తమ‌వైన‌ డ్యాన్స్ కదలికలతో విపరీతంగా స్పందించారు. కానీ ఇప్పుడు అందరూ పింక్ బ్యాండో బికినీ- షార్ట్ లలో నోరాతో పోటీప‌డాల‌నుకోవ‌డం ఖాయం.

డెనిమ్ షార్ట్‌- పింక్ బ్యాండ్యూ బికినీ సెట్ లో నోరా చాలా స్పెష‌ల్ గా ఉంద‌ని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ బ్యూటీ ప్ర‌స్తుతం డ్యాన్స్ రియాలిటీ షోల జ‌డ్జిగా .. ఐట‌మ్ భామ‌గా భారీగానే ఆర్జిస్తోంది. విదేశీ ఈవెంట్లు... ఫ్యాష‌న్ ఈవెంట్లు ...ఇత‌ర‌ ప్ర‌క‌ట‌న‌ల ద్వారాను ఆదాయాన్ని గ‌ణ‌నీయంగా పెంచుకుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.