Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: శాడిజం పీక్స్ కు వెళ్లింది

By:  Tupaki Desk   |   17 Dec 2017 7:24 AM GMT
ట్రైలర్ టాక్: శాడిజం పీక్స్ కు వెళ్లింది
X
తెరమీద హత్యలు జరిగే క్రమాన్ని రియలిస్టిగ్గా.. చాలా కొత్తగా చూపిస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. ఆ శైలికి తన క్రియేటివిటీని కూడా జోడించి.. ‘దండుపాళ్యం’ సినిమాను కొత్తగా తీర్చిదిద్దాడు శ్రీనివాసరాజు అనే దర్శకుడు. తెలుగువాడైన ఈ యంగ్ డైరెక్టర్ కన్నడలో తీసని ‘దండుపాళ్యం’ సెన్సేషనల్ హిట్టయింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా చాలా వయొలెంట్ గా.. ‘రా’గా ఈ సినిమాను మలిచిన తీరు కన్నడ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ చిత్రం తెలుగులోకి కూడా అనువాదమై ఇక్కడి ప్రేక్షకుల్ని కూడా మెప్పించింది. దీంతో కొన్నేళ్ల విరామం తర్వాత దీనికి కొనసాగింపుగా ‘దండుపాళ్యం-2’ తీశాడు శ్రీనివాసరాజు.

ఐతే తొలి భాగంతో పోలిస్తే ఇదేమంత భిన్నంగా అనిపించలేదు. అవే హత్యలు.. అదే శాడిజం.. అదే గోల.. అనే ఫీలింగ్ కలిగింది జనాలకు. రెండో భాగం చూస్తుంటేనే జనాలకు మొనాటనీ ఫీలింగ్ కలిగింది. ‘దండుపాళ్యం-2’ తెలుగు ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు. కన్నడలో కూడా ఈ సినిమా ఆడలేదు. ఐతే అప్పటికే మూడో భాగం షూటింగ్ మొదలుపెట్టేసి ఉన్న శ్రీనివాసరాజు.. కొన్ని నెలల వ్యవధిలోనే ‘దండుపాళ్యం-3’ని రెడీ చేసేశాడు. దీని ట్రైలర్ కూడా వచ్చేసింది. దీన్ని కొత్తగా చూపించేందుకు బ్లాక్ అండ్ వైట్ లుక్ ఇచ్చారు. కేవలం రక్తాన్ని మాత్రం అదే రంగులో చూపించారు. ట్రైలర్ మొత్తం ప్రతి షాట్లోనూ రక్తం చూపించారు. ప్రతి సీన్ చాలా వయొలెంట్ గా ఉంది. శృంగార సన్నివేశాల్ని కూడా చాలా పచ్చిగా తీశారు. కొన్ని చోట్ల సన్నివేశాలు మరీ జుగుప్స కలిగించేలా ఉన్నాయి. దండుపాళ్యం గ్యాంగ్ ‘శాడిజం’ పీక్స్ కు వెళ్లిపోయినట్లుగా అనిపిస్తోంది. ‘దండుపాళ్యం-2’కే జనాలకు మొహం మొత్తేసిందంటే.. ఇక మూడో భాగాన్ని ఏమాత్రం ఆదరిస్తారన్నది సందేహమే. ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.