Begin typing your search above and press return to search.
దండుపాళ్యం 3 రాకుండా... 4 ఏంటీ?
By: Tupaki Desk | 1 March 2018 7:37 AM GMTఏంటో కొన్ని సినిమా సీక్వెల్స్ అసలు అర్థం కావు. దండుపాళ్యం పేరుతో వస్తున్న సినిమాలు మాస్ జనాలు బాగా ఆకట్టుకోవడంతో... ఆ దర్శక నిర్మాతలు వరుసపెట్టి సినిమాలు తీసేయడానికి సిద్ధపడిపోతున్నారు. అందులో తప్పులేదు కానీ... అసలు సీక్వెల్ 3వ సినిమా విడుదలవ్వకుండా... 4వ సినిమా గురించి చెబితే ఏం అర్థమవుతుంది జనాలకి.
వెంకట్ మూవీస్ బ్యానర్ పై కె.టి.నాయక్ దర్శకత్వంలో వెంకట్ నిర్మిస్తున్న చిత్రం 'దండుపాళ్యం 4'. ఈ సినిమా షూటింగ్ మార్చి 8న ప్రారంభం కానున్నట్టు దర్శకనిర్మాతలు చెబుతున్నారు. దండుపాళ్యం 1వ భాగం... రెండో భాగం విడుదలయ్యాయి. కానీ మూడో భాగం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అది ఇంకా షూటింగ్ అవుతున్నట్టు సమాచారం. మరి మూడో సినిమా విడుదలవ్వక ముందే... నాలుగోభాగం ఫస్ ట్‌లుక్ ను కూడా విడుదల చేసేసింది చిత్రయూనిట్. అసలు ఇంత హడావుడిగా 4వ భాగం గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది గురూ?
దండుపాళ్యం 3 సంగతేంటో మాట్లాడని నిర్మాత వెంకట్ నాలుగో భాగం గురించి మాత్రం తెగ చెబుతున్నాడు. ఇది రియల్ లైఫ్ సంఘటనల నుంచి స్పూర్తి పొంది తీస్తున్నట్టు చెప్పారు. మొదటి రెండు సీక్వెల్స్ లాగానే ఇది కూడా ప్రేక్షకులను బాగా రీచ్ అవుతుందని అన్నారు. ఆ సీక్వెల్స్‌లో నటించిన పూజా గాంధీ -మకరంద్ దేశ్ పాండే - రవిశంకర్ - రవి కాలే - పెట్రోల్ ప్రసన్న వీరే నాలుగో భాగంలోనూ ఉంటారని, వీరితో పాటూ మరో కొత్త గ్యాంగ్ కూడా నాలుగో భాగంలో కనిపిస్తుందని చెబుతున్నారు. మూడో సీక్వెల్ గురించి మర్చిపోయినట్టున్నాడు నిర్మాత వెంకట్.
ఇదంతా ఒకెత్తయితే.. అసలు నేరాలు ఘోరాలు ఎపిసోడ్లను తలపించే ఈ జుగుప్సాకరమైన క్రయిమ్ కథను ఇన్నేసి భాగాల్లో చెబుతూ సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? మరో యాంగిల్ ఏంటంటే.. దండుపాళ్యం 1 సినిమాను తీసిన దర్శకుడు శ్రీనివాస్ రాజు.. ఆ సినిమా నిర్మాతలు ఇప్పుడు తను లేకుండా పార్ట్ 4 తీయడానికి ఒప్పుకోవట్లేదు. అలాగే పూజా గాంధి మకరంద్ దేశ్ పాండే వంటి నటులు కూడా ఈ 4వ భాగం చేస్తామని మేం చెప్పలేదే అంటూ ఫైర్ అవుతున్నారు. తెలుగులో గుంటూర్ టాకీస్ హిట్టవ్వగానే ఆ సినిమా ప్రొడ్యూసర్ వేరే దర్శకుడితో కలసి గుంటూర్ టాకీస్ 2 అన్నాడు. ఇది కూడా అలాగే ఉంది కదూ.