Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీ కమిట్ మెంట్లు.. పెళ్లిళ్లపైనా దంగల్ బ్యూటీ సెన్సేషన్స్
By: Tupaki Desk | 3 May 2021 8:33 AM GMTమీటూ వేదికగా చాలామంది కథానాయికలు తమకు జరిగిన అన్యాయాలపై ఓపెనయ్యారు. ఫేవర్ చేయకపోతే ఎవరూ అవకాశాలివ్వరని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్. ఇండస్ట్రీలో కమిట్ మెంట్ లేనిదే ఏదీ లేదు. తనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం ఫాతిమ కామెంట్లు అభిమానుల్లో వైరల్ గా మారాయి.
ఫాతిమా సనా షేక్ తాను విషపూరిత సంబంధాలలో ఉన్నట్లు వెల్లడించారు. వాటి నుంచి బయటపడటం చాలా కష్టం అవుతుంది అని కూడా వ్యాఖ్యానించారు. ఫాతిమ నటించిన అజీబ్ దాస్తాన్స్ నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ ప్రమోషన్స్ లో పైవిధంగా వ్యాఖ్యానించారు.
ఫాతిమా సనా షేక్ తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా ప్రైవేటుగా ఉండేది. కానీ ఇటీవల తన గత సంబంధం గురించి ఓపెనయ్యారు. తదుపరి జైదీప్ అహ్లవత్ సరసన శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్న మజ్నులో ఆమె కనిపించనుంది.
మహిళలు భర్తపై ఆర్థికంగా ఆధారపడినప్పుడు ఈ చెడ్డ వివాహం నుండి బయటపడటం చాలా కష్టం అని ఫాతిమా వ్యాఖ్యానించడం సంచలనమే అయ్యింది.
ఫాతిమా దంగల్ చిత్రంతో పాపులరైంది. థగ్స్ ఆఫ్ హిందోస్తాన్ - సూరజ్ పె మంగల్ లాంటి భారీ చిత్రాలలో కనిపించింది. ఈ నెల ప్రారంభంలో, తనకు కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ జరిగింది. కోవిడ్ సోకాక సీనియర్ నటుడు అనీల్ కపూర్ ఇంట్లో వండిన ఆహారాన్ని ప్యాక్ చేసి తనకు పంపించారని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆ ఇద్దరూ కలిసి ఒక సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.