Begin typing your search above and press return to search.
17 రోజులు.. 341కోట్లు.. ఏమి సినిమా గురూ!
By: Tupaki Desk | 9 Jan 2017 8:45 AM GMTఅమీర్ ఖాన్ నటించి, నిర్మించిన "దంగల్" సినిమా భారీ వసూళ్లతో బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. అమీర్ ఖాన్ గత సూపర్ హిట్ చిత్రం "పీకే" రికార్డులను బద్దలుకొడుతూ స్వదేశంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాగా "దంగల్" సరికొత్త రికార్డు సృష్టించింది. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ కలెక్షన్స్ విషయంలో దుమ్ములేపుతున్న ఈ సినిమా ఇప్పటివరకు ఈ సినిమా రూ.341.96 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని తెలుస్తుంది.
2014లో వచ్చిన "పీకే" సినిమా ఇండియాలో తొలిసారిగా రూ.300 కోట్ల మైలురాయిని దాటి రూ.340.8 కోట్ల కలెక్షన్లతో హయ్యెస్ట్ గ్రాసరీగా చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సినిమా భజరంగీ భాయిజాన్.. రూ.320.34 కోట్లు, సల్మాన్ లేటెస్ట్ ఫిల్మ్ సుల్తాన్.. రూ.300.67 కోట్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే ఆ మూడు సినిమాల రికార్డులను తిరగరాస్తూ తాజాగా రూ.341.96 కోట్ల వసూళ్లతో "దంగల్" టాప్ పొజిషన్ కు చేరింది. ఈ సినిమా విడుదలయిన మొదటి 13 రోజుల్లోనే 300 కోట్ల మార్కును చేరుకోవడం విశేషం.
ఈ సినిమా తొలివారంలో సుమారు 196 కోట్ల వసూళ్లు సాధించగా, రెండోవారానికి వచ్చేసరికి సుమారు 116 కోట్లు సాధించింది. ఇదే క్రమంలో ఆదివారం నాటికి మొత్తంగా 341కోట్ల వసూళ్లు సాధించి "పీకే" రికార్డులను చెరిపేసింది. ఈ సినిమా ఇంకా మరో వారం రోజుల పాటు నిరాటంకంగా తన వసూళ్ల పరంపరను కొనసాగించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/