Begin typing your search above and press return to search.
మత విశ్వాసాలకు ఇబ్బందిగా ఉందంటూ సినీ పరిశ్రమకు గుడ్ బై
By: Tupaki Desk | 1 July 2019 5:57 AM GMTనిండా ఇరవై ఏళ్లు కూడా లేవు.. అమీర్ ఖాన్ లాంటి అగ్రనటుడితో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. తన టాలెంట్ తో తొలిసారే జాతీయ అవార్డును సాధించింది ఆమె ప్రతిభకు మురిసిన అమీర్ స్వయంగా ఆమెతో సినిమా నిర్మించారు. అంతేనా.. ఆ చిత్రంలో సహాయ నటుడి పాత్రను పోషించారు. ఆమె టాలెంతో మూడో సినిమాలో అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రాతో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్రం విడుదల కాకముందే సినిమాలకు గుడ్ బై చెప్పేసి సంచలనం సృష్టించింది. ఇంతకీ ఆమె ఎవరంటారా? దంగల్ నటిగా సుపరిచితురాలైన కశ్మీరీ జైరా వాసిం.
13 ఏళ్లకు అనుకోని రీతిలో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అనతి కాలంలోనే పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుంది.అలాంటి ఆమె తాను సినిమా రంగాన్ని విడిచి వెళుతున్నట్లుగా ప్రకటించి సంచలనం సృష్టిస్తోంది.
18 ఏళ్ల జైరా సినిమా రంగాన్ని ఎందుకు వదిలి వెళుతుందన్న విషయంపై ఆమే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఆమె ఒక సుదీర్ఘ పోస్ట్ చేవారు. తాను ప్రయాణిస్తున్న సినిమా రంగం తన మత విశ్వాసాలకు అడ్డు తగులుతున్నట్లుగా పేర్కొన్నారు. అందుకే తానిక సినిమా రంగంలో పని చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
బాలీవుడ్ తనకు ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చి పెట్టిందని.. అయితే తానీ రంగానికి కోరుకొని రాలేదని.. తాను చేస్తున్న పనిలో తాను సంతోషంగా లేనని స్పష్టం చేసింది. తాను ఇంకెవరిలానో కావటానికి కష్టపడుతున్నట్లుగా అనిపిస్తోందన్న ఆమె.. విజయాలకు.. వైఫల్యాలకు తాను అనుకునేది వేరని పేర్కొంది.
తనకీ రంగం ఎంతో ప్రేమను.. అండను.. అభినందనల్ని ఇచ్చిందని కానీ ఇదే రంగం తన మత విశ్వాసాలను నిర్లక్ష్యం చేసేలా కూడా చేసినట్లు వెల్లడించింది. తన మత విశ్వాసాలకు అడ్డు తగిలే ఇక్కడి వాతావరణంలో పని చేస్తున్నకొద్దీ.. తన మతంతో తనకున్న అనుబంధం దెబ్బ తినే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేసింది. కారణం ఏమైనా.. ప్రతిభ ఉన్న ఒక నటి చిన్న వయసులోనే సినిమా రంగానికి గుడ్ బై చెప్పటం బాధ కలిగించే అంశంగా చెప్పక తప్పదు.