Begin typing your search above and press return to search.
దంగల్.. ఇవేం వసూళ్లు బాబోయ్
By: Tupaki Desk | 10 May 2017 7:04 AM GMTఇండియా అంటే చైనీయుల్లో ఎంత వ్యతిరేకత ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వాళ్లు మన ఇండియన్ సినిమాల్ని ఆదరిస్తారని కూడా ఎవరూ ఆశించే వాళ్లు కాదు. అందుకే అక్కడ మన సినిమాల్ని రిలీజ్ చేయడానికి అంతగా ఆసక్తి చూపించేవాళ్లు కాదు. కానీ అమీర్ ఖాన్ ధైర్యం చేసిన తన సినిమాల్ని అక్కడ రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు. అమీర్ చివరి సినిమా ‘పీకే’ చైనాలో ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ‘దంగల్’ అక్కడ మరింతగా దుమ్ము దులుపుతోంది. ఇండియాలో విడుదలైన నాలుగు నెలల తర్వాత చైనాలో విడుదలైన ఈ సినిమా అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్తోంది.
ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరిపోయింది. ఈ మంగళవారం నాటికి ‘దంగల్’ చైనాలో రూ.120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వీకెండ్ తర్వాత కూడా అక్కడ ఈ సినిమా అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. చైనా వ్యాప్తంగా ‘దంగల్’ను 9 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ చేయడం విశేషం. ‘దంగల్’ దేశభక్తి టచ్ ఉన్న సినిమా. అలాంటి సినిమాను చైనీయులు ఆదరించడం విశేషమే. ఐతే బేసిక్ ఎమోషన్లన్నవి ఎవరికైనా ఒకటే అని.. అమీర్ బృందం కమిట్మెంట్ తో చేసిన ప్రయత్నం వాళ్లకూ నచ్చుతోందని అంటున్నారు విశ్లేషకులు. కానీ ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాను చైనాలో భారీ ఎత్తున విడుదల చేయగా ఈ సినిమా వారికి ఆనలేదు. దానికి నామమాత్రపు వసూళ్లు వచ్చాయి. మరి ‘ది కంక్లూజన్’ అక్కడ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.