Begin typing your search above and press return to search.
దుమ్ముదులుపుతున్న దంగల్
By: Tupaki Desk | 7 May 2017 5:52 PM GMT‘దంగల్’ సినిమా రిలీజై నాలుగు నెలలు దాటుతోంది. ఇప్పుడీ సినిమా కొత్తగా దుమ్ముదులపడమేంటి అంటారా..? ఇండియాలో గత ఏడాది డిసెంబర్లోనే విడుదలైన ఈ సినిమా.. చైనాలో మాత్రం రెండు రోజుల కిందటే రిలీజైంది. ఆ దేశంలో ఏకంగా 9 వేలకు పైగా థియేటర్లలో రిలీజైందీ సినిమా. భారీ స్థాయిలో విడుదల కావడమే కాదు.. భారీగా వసూళ్లు కూడా రాబడుతోందీ సినిమా. కేవలం రెండు రోజుల్లోనే చైనాలో ‘దంగల్’ 40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తొలి రోజు 2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన ‘దంగల్’.. రెండో రోజు అంతకంటే కొంచెం ఎక్కువే కలెక్ట్ చేసింది. ఆదివారం కూడా వసూళ్లు భారీగానే ఉంటాయని భావిస్తున్నారు.
‘దంగల్’ కంటే ముందు అమీర్ నటించిన ‘పీకే’ చైనాలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించగా.. ‘దంగల్’ అంతకంటే భారీగానే వసూళ్లు రాబట్టేలా ఉంది. రెజ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘దంగల్’ చైనా ప్రేక్షకులకు కూడా బాగానే కనెక్టవుతోంది. అక్కడ కూడా రెజ్లింగ్ ప్రముఖ క్రీడే కావడం.. స్పోర్ట్స్ మీద చైనీయులకు శ్రద్ధ ఎక్కువ కావడంతో ఇందులోని ఎమోషన్లు అక్కడి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ‘దంగల్’కు చైనా క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూలిచ్చారు. ఓవైపు ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రభంజనం సాగిస్తుంటే.. మరోవైపు ‘దంగల్’ చైనాలో హవా సాగిస్తుండటం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/