Begin typing your search above and press return to search.

ప్చ్.. దంగల్ 2000 కోట్లు కొట్టలేదు

By:  Tupaki Desk   |   4 July 2017 7:00 AM GMT
ప్చ్.. దంగల్ 2000 కోట్లు కొట్టలేదు
X
మహావీర్ సింగ్ ఫోగాట్ జీవిత కథ ఆదారంగా నిర్మించిన ‘దంగల్’ సినిమా మన దేశంలోనే కాదు పక్క దేశాలులలో కూడా అంతే హిట్ అయిన విషయం మనకు తెలుసు. గీత ఫోగాట్ - బబిత ఫోగాట్ ను మహావీర్ సింగ్ ఎలాంటి శిక్షణ ఇచ్చి అతను ఎన్ని అవాంతరాలు ఎదుర్కొని వాళ్ళని దేశం గర్వపడే వ్రెజ్లర్ గా తయారు చేసిన విదానం దర్శకుడు నితీష్ తివారీ చాలా గొప్పగా చూపించి అందరిచే శబాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా మన దేశం బాక్స్ ఆఫీసు వద్దే కాకుండా ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీసు వద్ద కూడా మంచి స్థానంలోనే నిలిచింది.

ఇప్పుడు ఈ సినిమా విజయం గురించి కాకుండా ‘దంగల్’ కలెక్ట్ చేసిన బాక్స్ ఆఫీసు కలెక్షన్లు గురించి పెద్ద చర్చే జరుగుతుంది. ఒక ఇండియా సినిమా ప్రపంచం బాక్స్ ఆఫీసు వద్ద అత్యదిక కలెక్షన్లు చేసిన సినిమాగా రికార్డు కూడా చేసింది. ఈ మధ్య దంగల్ కలెక్షన్లు 2000 కోట్లు చేరింది అని వార్త వచ్చింది. కానీ విషయం పై ఆ సినిమాకు సంబంధించిన సన్నిహితుడు ఏమన్నాడంటే.. “మేము చాల దగ్గర దంగల్ సినిమా 2000 కోట్లు కలెక్షన్ మార్క్ చేరింది అని చదివాము. అందులో నిజం లేదు మా సినిమా కలెక్షన్ కిందటి వారానికి 1864 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దేశంలోనూ ప్రపంచంలోను దంగల్ కు దక్కిన గౌరవం ప్రేమ మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. ఈ సినిమాను ప్రపంచ ప్రేక్షకులు చేరువ చేసే పనిలో ఉన్నాము'' అని కామెంట్ చేశాడు.

అయితే ఈ సినిమా 2000 కోట్లు కొట్టేసిందంటూ.. బాహుబలి 2 రేంజును కూడా దాటేసిందంటూ ఆల్రెడీ బాలీవుడ్లో సంబరాలు మొదలైన వేళ.. అబ్బే ఇంకా 2000 టచ్ అవ్వలేదు అంటే వారు ఫీలవుతున్నారు. నితేష్ తివారీ డైరెక్ట్ చేసిన దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ మహావీర్ గా, అతని భార్యగా సాక్షి తన్వార్గా, అతని కూతుర్లుగా ఫాతిమా సనా, సన్యా మల్హోత్రా నటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/