Begin typing your search above and press return to search.
అమెరికా థియేటర్లు ఆగస్టులోనూ కష్టమే
By: Tupaki Desk | 16 July 2020 4:15 AM GMTఊహించని ముప్పులా ముంచుకొచ్చిన వైరస్ మహమ్మారీ అన్ని పరిశ్రమల్ని నాశనం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వినోదరంగాన్ని అతలాకుతలం చేసింది. ఇండియా .. అమెరికా... చైనా.. మలేషియా ఎక్కడా సినిమాల రిలీజ్ అన్నదే లేదు. హాలీవుడ్ సహా భారతదేశ సినిమా మార్కెట్ కి ఎంతో కీలకమైన అమెరికాలో థియేటర్లు మూసేయడంతో ఏమీ తోచని పరిస్థితి. అమెరికా.. భారతదేశంలోనూ కొవిడ్ అంతకంతకు పెరుగుతుంటే ఇక థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయో తెలియని సందిగ్ధత ఉంది.
అయితే కొవిడ్ పరిస్థితి ఎలా ఉన్నా మొండివాడైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో తిరిగి థియేటర్లు తెరుచుకుంటాయనే ప్రచారం సాగింది. జూలై 15 న తిరిగి అమెరికాలోని అతిపెద్ద సినిమా చైన్ అయిన ఏఎంసీ థియేటర్స్ ఓపెన్ అవుతాయని ప్రకటించారు. కానీ మరోసారి జూలై 30 కి వాయిదా పడింది. అమెరికాలో చాలా రాష్ట్రాల్లో పెరుగుతున్న వైరస్ కేసులు ఊపిరాడనివ్వడం లేదు.
దాంతో పాటు ఇప్పటికే రిలీజ్ చేయాల్సిన సినిమాల విషయంలో హాలీవుడ్ నిర్మాతలు సంశయిస్తున్నారు. దీంతో థియేటర్లకు సరిపడా క్రొత్త కంటెంట్ లేనే లేదు. హాలీవుడ్ భారీ రిలీజ్ లు టెనెట్ .. ములాన్ లను జూలై నుండి ఆగస్టుకు వాయిదా వేశారు. ఇంకా చాలా సినిమాలు రిలీజ్ కి రాకుండా వాయిదా పడ్డాయి. మార్చి నుండి థియేటర్లు మూత పడే ఉన్నాయి. ఏప్రిల్ నుండి థియేటర్ల అద్దెను చెల్లించకుండా ఏఎంసీ వాళ్లు వదిలేశారు. కనీసం ఆగస్టు నాటికి అయినా పరిస్థితి తిరిగి యథా స్థితికి రాకపోతే ఏఎంసీ సినిమాస్ దివాళా తీస్తుందని పుకార్లు వచ్చాయి. అంతేకాదు.. ప్రఖ్యాత దిగ్గజ సంస్థ అమెజాన్ ఏఎంసీని సొంతం చేసుకునే యోచనలో ఉన్నట్లు ఇదివరకూ కథనాలొచ్చాయి. కనీసం ఈ మార్పు జరిగినా ఓ కొత్త ఆశ ఉండేది. కానీ ఇప్పుడు వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గకపోవడంతో ఆ ఆశలు కూడా లేవు. ఆగస్టు - సెప్టెంబర్ నాటికి అయినా అమెరికాలో థియేటర్లు తెరుచుకునే సీన్ కనిపించడం లేదని తేలింది.