Begin typing your search above and press return to search.
నో ఓటీటీ... కొత్త డేట్ ఇచ్చిన వర్
By: Tupaki Desk | 22 April 2022 2:30 PM GMTవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డేంజరస్ అనే సినిమాను తెరకెక్కించి పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈనెల 8వ తారీకున విడుదల చేయడం కోసం దేశంలో పలు ముఖ్య నగరాల్లో ఇద్దరు హీరోయిన్స్ తో కలిసి చక్కర్లు కొట్టి సినిమాను ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు. కాని సినిమా విడుదల చివరి నిమిషంలో వాయిదా వేయడం జరిగింది.
గొడవలు.. వివాదాల కారణంగా వర్మ సినిమా విడుదల అయ్యేది కష్టమే అంటూ అంతా భావిస్తున్న సమయంలో కొందరు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు వస్తారనే ప్రచారం కూడా జరిగింది. సినిమా కు ఓటీటీ లో మంచి రేటు రావడం కోసం ఇంత హడావుడి చేస్తున్నాడు అనే పుకార్లు కూడా షికార్లు చేశాయి. అయితే వర్మ తన ఈ సరికొత్త విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాను థియేటర్ల ద్వారా మాత్రమే తీసుకు వస్తానంటున్నాడు.
మరోసారి ఈ డేంజరస్ 'మా ఇష్టం' సినిమాను విడుదల చేయడం కోసం కొత్త విడుదల తేదీని ప్రకటించారు. హీరోయిన్స్ గా నైనా గంగూలీ మరియు అప్సర రాణి నటించిన ఈ సినిమా మొదటి ఇండియన్ లెస్బియన్ మూవీగా వర్మ ప్రచారం చేస్తున్నాడు. మంచి కథతో మంచి నేపథ్యంలో వర్మ ఈ సినిమాను తీశాం.. తప్పకుండా ఆర్ ఆర్ ఆర్ రేంజ్ లో ఒక మంచి మల్టీస్టారర్ గా నిలుస్తుందని ప్రచారం చేస్తున్నాడు.
ఈనెల 8న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాను వచ్చే నెల 6వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. వర్మ ఈమద్య కాలంలో చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. ఆయన సినిమాలను ఆసక్తితో కాకుండా ఏదో అల్లాటప్పగా తీస్తున్నాడు అంటూ అర్థం అయ్యింది. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ వచ్చాయి.. ఇద్దరు హీరోయిన్ ల కథతో సినిమా లు రావడం చాలా అరుదుగా జరుగుతుంది.
వర్మ ఇద్దరు హీరోయిన్స్ ను ఏ రేంజ్ లో చూపించాలో ఆ రేంజ్ లో చూపించాడు.. ఏ స్థాయిలో చూపించాలో ఆ స్థాయిలో చూపించాడు. కనుక తప్పకుండా ప్రేక్షకులు ముఖ్యంగా యూత్ ఆడియన్స్ మా ఇష్టం సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి వర్మ ఈ డేంజరస్ సినిమా ను ఈసారి అయినా అనుకున్న తేదీకి విడుదల చేస్తాడా అనేది చూడాలి. ఇంతకు ముందు వచ్చిన సమస్యలు ఇప్పుడు రాకుండా ఎలా ఉంటాయి అనేది కొందరి ప్రశ్న... మొత్తానికి ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి.