Begin typing your search above and press return to search.

మళ్లీ.. జేమ్స్ బాండ్ చేయమంటే చస్తాడంట

By:  Tupaki Desk   |   10 Oct 2015 4:00 AM IST
మళ్లీ.. జేమ్స్ బాండ్ చేయమంటే చస్తాడంట
X
తెర మీద చెలరేగిపోవటమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులే కదా.. సాదాసీదా జీవితంలోనూ తాము బాండ్ మాదిరిగా ఉండాలని.. జేమ్స్ బాండ్ వేషాల్లో ఒకట్రెండు అయినా జీవితంలో చేయాలని తెగ ఉబలాటపడిపోతుంటారు. రియల్ లైఫ్ లో బాండ్ లా వ్యవహరించటం సంగతి పక్కన పెడితే.. రీల్ లో బాండ్ వేషం వేయటం తేలికేం కాదని చెబుతున్నారు.

బాండ్.. జేమ్స్ బాండ్ అంటూ రెండు మాటల్ని స్టైల్ గా చెప్పటం.. తర్వాత మ్యూజిక్ తో కిర్రెక్కించే జేమ్స్ బాండ్ పాత్రను పోషిస్తున్న తాజా జేమ్స్ బాండ్ పాత్రధారి.. ఆ పాత్ర కష్టం ఏమిటో తన మాటల్లో చెప్పుకొచ్చాడు. 2006.. 2008.. 2012లో జేమ్స్ బాండ్ పాత్రను పోషించిన డేనియల్ క్రెగ్ తాజాగా మరోసారి బాండ్ పాత్రను పోషిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత తనను కానీ బాండ్ పాత్ర చేయమని కోరితే.. బ్లేడ్ తో మణికట్టు మీద కోసుకొని చచ్చిపోతానే తప్పించి.. బాండ్ పాత్ర చేయనని తేల్చేశాడు. మరీ తప్పదనుకుంటే.. రెండేళ్లు ఆగిన తర్వాత ఓకే చెబుతానని చెబుతున్న ఆయన.. అది కూడా డబ్బుల కోసమే తప్పించి మరో దాని కోసం కాదని తేల్చేశాడు. తెర మీద చేసే జేమ్స్ బాండ్ విన్యాసాల వెనుక.. ప్రాణాలు అలిసిపోయేంత శ్రమ ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. జేమ్స్ బాండ్ చిత్రీకరణ ఎంత కష్టమో.. ఈ పాత్ర కోసం ఎంత కష్టడాలన్న విషయం డేనియల్ క్రెగ్ మాటల్లో స్పష్టమవుతుందని చెప్పొచ్చు.