Begin typing your search above and press return to search.
'సార్' కోసం ధనుష్ అంతకు మించి..!
By: Tupaki Desk | 5 July 2022 7:52 AM GMTతమిళంలో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్న ధనుష్ కు చాలా కాలం నుండి హిందీలో మంచి గుర్తింపు ఉన్న విషయం తెల్సిందే. హీరోగా కేవలం తమిళ్ లో మాత్రమే కాకుండా హిందీ.. ఇంగ్లీష్ లో కూడా సినిమాలు చేస్తూ ధనుష్ తన స్టార్ డమ్ ను అక్కడ కూడా నిరూపించుకునే ప్రయత్నాలు చేశాడు.. ఇంకా చేస్తూనే ఉన్నాడు.
కాని ఈయన టాలీవుడ్ లో మాత్రం పెద్దగా మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడంలో సఫలం కాలేదు. హీరోగా ధనుష్ నటించిన చాలా సినిమాలు తెలుగు లో కూడా డబ్ అయ్యాయి కాని కమర్షియల్ విజయాలను దక్కించుకున్న దాఖలాలు చాలా తక్కువ. అందుకే తెలుగు ప్రేక్షకుల ముందుకు నేరుగా వచ్చే ఉద్దేశ్యంతో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.
వీరిద్దరి కాంబోలో 'సార్' సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అయ్యింది. షూటింగ్ కూడా ముగింపు దశకు వచ్చేది. కాని ఆమద్య ధనుష్ సార్ షూటింగ్ సమయంలో కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. దాంతో సార్ కాస్త ఆలస్యం అవుతోంది. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీతో పాటు ఇతర సౌత్ భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు.
ఒక డైరెక్ట్ తెలుగు సినిమాగా ప్రమోట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగు వర్షన్ కు స్వయంగా ధనుష్ తో డబ్బింగ్ చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ధనుష్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా డబ్బింగ్ చెప్పడం కాస్త కష్టం. అందుకే ఆయన్నే డబ్బింగ్ చెప్పించడం వల్ల సినిమాకు అదనపు ఆకర్షణ అంటూ యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.
తెలుగు లో మాట్లాడే ధనుష్ కాస్త కష్టపడి సార్ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చాడట. కేవలం నటించి వెళ్లకుండా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనుకోవడం నిజంగా అభినందనీయం. మన తెలుగు హీరోల్లో పలువురు ఇతర భాషల్లో నటిస్తున్నారు. కాని కొద్ది మంది మాత్రమే ఆయా భాషల్లో డబ్బింగ్ చెబుతున్నారు.
భాష సమస్య ఉన్నా కూడా కాస్త రిస్క్ చేసి సినిమా కోసం డబ్బింగ్ చెప్పడం వల్ల మంచి ఫలితాలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే సార్ కోసం కేవలం నటించడం మాత్రమే కాకుండా అంతకు మించి అన్నట్లుగా డబ్బింగ్ కూడా చెప్పేందుకు సిద్దం అయ్యాడు.