Begin typing your search above and press return to search.

అమ్మాయి ముందు ఫోజులు కొట్టిన హీరో!

By:  Tupaki Desk   |   16 Feb 2023 6:00 AM GMT
అమ్మాయి ముందు ఫోజులు కొట్టిన హీరో!
X
హీరోల‌కుండే క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్లాది మంది అభిమానిస్తారు. అందులో గాళ్స్ ఎంతో మంది ఉంటారు. ఇంకా చెప్పాలంటే? న‌చ్చిన హీరోకి లేడీ ఫాలోవ‌ర్స్ ఏ రేంజ్ లో ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. హీరోల‌తో సెల్పీలు దిగ‌డానికి గాళ్స్ మీద మీద‌కి ఎగ‌బ‌డిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. మ‌రి అదే హీరో ఇమేజ్ లేక‌పోతే ప‌రిస్థితి ఏంటి? అప్పుడే ఏ అమ్మాయి ప‌ట్టించుకుంటుంది? అస‌లు ఖాత‌రు కూడా చేయ‌దు.

స‌రిగ్గా ఇలాంటి అనుభ‌వాన్నే ఎదుర్కున్నాడు కోలీవుడ్ హీరో ధ‌నుష్. అవును ఇప్పుడు హీరో అయ్యాడు కాబ‌ట్టి గాళ్స్ లో ఫాలోయింగ్ ఉంది. హీరో కాన‌ప్పుడు అత‌డు ఓ సాధార‌ణ జీవి. మ‌రి ఆజీవికి జీవితంలో ఎదురైన కొన్ని అనుభ‌వాల గురించి చెప్పుకుంటూ వ‌చ్చి..యువ‌త‌కి చ‌క్క‌ని ఓ సందేశం ఇచ్చాడు. ఆయ‌న హీరోగా న‌టించిన `సార్` రిలీజ్ సంద‌ర్భంగా ఈ విష‌యాల‌న్ని రివీల్ చేసారు.

`స్టూడెంట్ లైఫ్‌ను నేను కొంద‌రి లా మిస్ అయ్యాను. అప్పట్లో చదువును నిర్లక్ష్యం చేసాను. ఇప్పుడు పిల్లలను చదివిస్తుంటే చదువు కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది. చదువుకునే సమయంలో చాలా అల్లరి పనులు చేసాను. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసం ట్యూషన్‌లో చేరాను.

అదే అమ్మాయి కోసం బ‌య‌ట వెయిట్ చేసే వాడిని. తాను వ‌చ్చే ముందు నును ఉన్నాను అని చెప్ప‌డానికి బైక్ తో పెద్ద‌గా సౌండింగ్ చేసే వాడిని. ఇది గ‌మ‌నించి మా టీచ‌ర్లు లోప‌లున్న విద్యార్ధుల‌తో మీరంతా బాగా చదువుకుని ప‌రీక్ష‌లు పాసైతే ఉన్న స్థానంలో ఉంటార‌ని చెప్పేవారు. బ‌య‌ట బైక్ తో శ‌బ్ధం చేసేవాడు వీధుల్లో డాన్సు చేసుకోవాల్సిందేన‌ని వారు అన్న విష‌యాలు ఇప్పుడు ఒక్కొక్క‌టిగా గుర్తొస్తున్నాయి.

ఆ టీచ‌ర్ చెప్పిన‌ట్లే త‌మిళ‌నాడులో నేను డాన్సు చేయ‌ని వీధి అంటూ లేద‌ని న‌వ్వేసాడు. క్లాస్ రూమ్ లో ప్ర‌శ్న‌లు అడిగితే స‌మాధాన‌లు చెప్ప‌లేక సిగ్గుతో త‌ల దించుకునే వాడిని. అందుకే యువ‌త‌కి నాదొక స‌ల‌హా ఎంజాయ్ చేయండి. కానీ చ‌దువుని మాత్రం నిర్ల‌క్ష్యం చేయోద్దు` అంటూ నేటి యువ‌త‌ని ఉద్దేశించి హిత బోద చేసాడు.