Begin typing your search above and press return to search.
దర్బార్ బాక్సాఫీస్ .. చడీ చప్పుడు లేదే!
By: Tupaki Desk | 16 Jan 2020 4:50 AM GMT2020 సంక్రాంతి మూడు భారీ సినిమాలతో కొత్త కళ తెచ్చింది. మహేష్ - సరిలేరు నీకెవ్వరు.. బన్ని- అల వైకుంఠపురములో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చక్కని కలెక్షన్స్ సాధిస్తున్నాయన్న రిపోర్ట్ ఉంది. అయితే ఈ రెండు సినిమాల కంటే ముందే తలైవా రజనీ కాంత్ నటించిన దర్బార్ రిలీజైంది. ఈ సినిమా వసూళ్ల రేంజు ఎలా ఉంది? అన్నది విశ్లేషిస్తే.. దర్బార్ ఐదు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్ రిపోర్ట్ అందింది.
మొదటి నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో 150 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఆంధ్ర - తెలంగాణలో 14.5 కోట్ల ప్రీబిజినెస్ చేయగా.. మొదటి 5 రోజుల్లో దాదాపు 8 కోట్ల మార్క్ కి చేరువైందని తెలుస్తోంది. ఇక ఫుల్ రన్ లో మరో 7 కోట్లు చేస్తే కానీ డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయ్యే పరిస్థితి లేదు.
దర్బార్ ఐదు రోజుల ఆంధ్ర - తెలంగాణ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నైజాం - 3.98 కోట్లు.. సీడెడ్ - 95 లక్షలు.. గుంటూరు - 60 లక్షలు ..ఉత్తరాంధ్ర - 82.5 లక్షలు.. తూర్పు గోదావరి - 52.4 లక్షలు.. పశ్చిమ గోదావరి - 35 లక్షలు.. కృష్ణా - 42.7 లక్షలు.. నెల్లూరు - 31.6 లక్షలు వసూలైంది. ఐదు రోజుల మొత్తం 7.97 కోట్ల షేర్ తెచ్చింది. మహేష్ .. బన్ని లాంటి స్టార్ హీరోల సినిమాలతో పోటీపడుతూ మరో 7కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. లాంగ్ రన్ లో ఇది సాధిస్తుందా? అన్నది చూడాలి.