Begin typing your search above and press return to search.
మరోసారి భారీ విరాళం ప్రకటించిన డార్లింగ్ ప్రభాస్..
By: Tupaki Desk | 30 March 2020 9:30 AM GMTడార్లింగ్ ప్రభాస్.. ఈ రోజు తన విశాలమైన సేవా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నాడు. కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కడి ప్రజలు అక్కడే వైరస్ భయంతో అల్లాడిపోతున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటోంది. అందుకే రాష్ట్రాలలో సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం ఎవరి ఇళ్లకు వారు పరిమితమయ్యారు. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డార్లింగ్ ప్రభాస్ ఇదివరకే 4కోట్ల రూపాయలు భారీ విరాళం అందించారు.
తాజాగా మరోసారి డార్లింగ్ పెద్ద మనసున్నవాడని నిరూపించుకున్నాడు. తెలుగు సినీ చరిత్రలో నటీ నటులతో పాటు సినిమాల కోసం పనిచేసే కూలీల శ్రమ చెప్పలేనిది. లాక్ డౌన్ కారణంగా సినీ కూలీలు ఎవ్వరికి కూడా పనిలేకుండా పోయింది. అందుకే వారిని ఆదుకోవడానికి ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు కదిలి వచ్చి విరాళాలు అందిస్తున్నారు. అయితే డార్లింగ్ ప్రభాస్ ఈ రోజు సినీ వర్కర్స్ కోసం 50లక్షల రూపాయలు భారీ విరాళాన్ని ప్రకటించారు. దీనితో కలిపి డార్లింగ్ ఇప్పటివరకు ఒక్కడే 4.5 కోట్ల ఫండ్స్ అందించాడు. సినిమాలలోనే కాదు ఇతరులను ఆదుకోవడంలో కూడా మా డార్లింగ్ టాపే అంటున్నారు అభిమానులు.