Begin typing your search above and press return to search.
డిజాస్టర్ మూవీని రీ-రిలీజ్ చేస్తున్న డార్లింగ్..!
By: Tupaki Desk | 8 Oct 2022 12:30 PM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో తీవ్రంగా నిరాశ పరిచిన చిత్రాలలో ''రెబల్'' ఒకటి. ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఈ మూవీని తెరకెక్కించారు. 2012లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే దశాబ్దం తర్వాత ఈ యాక్షన్ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
''రెబల్'' సినిమాలో ప్రభాస్ సరసన తమన్నా భాటియా - దీక్ష సేత్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో కృష్ణంరాజు కూడా కీలక పాత్ర పోషించారు. అయితే రొటీన్ రివేంజ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నిర్మాతలు జె భగవాన్ - జె పుల్లారావు లకు తీవ్ర నష్టాలను మిగిల్చింది.
అంతేకాదు 'రెబల్' సినిమా విషయంలో దర్శక నిర్మాతలకు విభేదాలు వచ్చాయని.. ఎస్ థమన్ మధ్యలో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో లారెన్స్ స్వయంగా సంగీతం సనకూర్చారని అప్పట్లో టాక్ ఉండేది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన ఈ చిత్రాన్ని ప్రభాస్ పుట్టినరోజును సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు.
శ్రీ బాలాజీ సినీ మీడియా వారు అక్టోబర్ 15వ తేదీన ''రెబల్'' చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తన ఫ్యామిలీ మరణానికి కారణమైన వారిని కనుక్కొని.. ఓ యువకుడు వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే లైన్ తో ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కింది.
సినిమా ప్లాప్ అయినా ఇందులో స్టైలిష్ అండ్ రెబెల్ గా ప్రభాస్ మాస్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు. 'రెబల్' మూవీలోని యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఫైట్ సీక్వెన్స్ లకు సంబంధించిన వీడియోలకు యూట్యూబ్ లో మిలియన్ల కొలదీ వ్యూస్ ఉన్నాయి.
అందుకే ఇప్పుడు పదేళ్ల తర్వాత 'రెబల్' సినిమా మళ్ళీ థియేటర్లలోకి వస్తుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇది కచ్చితంగా మాస్ అండ్ యాక్షన్ ప్రియులకు ప్రభాస్ అందించే విందు భోజనంగా ఉంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో స్పెషల్ షోలు - రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోందనే సంగతి తెలిసిందే. ఇటీవల మహేష్ బాబు 'పోకిరి'.. పవన్ కల్యాణ్ 'జల్సా'.. నందమూరి బాలకృష్ణ 'చెన్నకేశవ రెడ్డి'.. ధనుష్ '3' సినిమాలను రీరిలీజ్ చేశారు. వీటికి ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ క్రమంలో రీ రిలీజ్ కాబోతోన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ''రెబల్'' సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ఇకపోతే ప్రస్తుతం 'ఆదిపురుష్' మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్'.. నాగ్ అశ్విన్ తో 'ప్రాజెక్ట్ K' సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. మారుతి తో ఓ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఇదే క్రమంలో సందీప్ వంగా తో కలిసి 'స్పిరిట్' అనే సినిమా చేయనున్నారు ప్రభాస్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.