Begin typing your search above and press return to search.

RFC లో లంబోర్ఘీనీపై డార్లింగ్ రైడ్!

By:  Tupaki Desk   |   21 July 2022 1:30 PM GMT
RFC లో లంబోర్ఘీనీపై డార్లింగ్ రైడ్!
X
ప్ర‌స్తుతం `ఆర్ ఎఫ్ సీ`లో ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `ప్రాజెక్ట్-కె` షూట్ కి సంబంధించి భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా కార్ ఛేజింగ్ స‌న్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ షూట్ లో ప్ర‌ధాన తార‌గ‌ణ‌మంతా పాల్గొంటుంది. ప్ర‌భాస్..దీపిక ప‌దుకొణే స‌హా కీ తారాగ‌ణ‌మంతా పొల్గొంటుంది.

కొద్ది రోజులుగా టీమ్ ఇదే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. షూట్ కి అవ‌స‌ర‌మైన అధునాత‌న టెక్నాల‌జీతో కూడిన కార్ల‌ను వినియోగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మోటార్ దిగ్గ‌జం ఆనంద్ మ‌హీంద్రా బ్రాండెడ్ కార్ల‌ని ఈ షూట్ లో ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రి లాంబోర్ఘిని లాంటి కోట్ల రూపాయ‌ల ఖ‌రీదుగ‌ల కార్ల‌ను ప్రాజెక్ట్ -కె కోసం దించారా? అంటే తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి అవున‌నే అనిపిస్తుంది.

అవును డార్లింగ్ `ర‌య్ ర‌య్` అంటూ లంబోర్ఘినీని ఆన్ సెట్ లో ప‌రుగులు పెట్టిస్తోన్న ఓ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారిందిప్పుడు. బ్లాక్ క‌ల‌ర్ లంబోర్ఘీనీపై డార్లింగ్ సెట్ లో రౌండ్ లు కొట్ట‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో నెటి జ‌నులు వేగం క‌న్నా ప్రాణం మిన్న అన్న సూక్తుల్ని డార్లింగ్ కి గుర్తు చేస్తున్నారు.

నెమ్మదిగా నడపండి సార్ `` నిర్మాతలు మీపై 2000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. జాగ్రత్తగా డ్రైవ్ చేయండ‌ని` ఓ నెటిజన్ రాశాడు. ఇంతలో కొంతమంది నెటిజన్లు లాంబోర్ఘిని వంటి స్పోర్ట్స్ కారు `అలా నెమ్మ‌దిగా నడపడానికి కొనుక్కున్నారా? అలాగైతే సైకిల్ బెస్ట్ క‌దా`` అంటూ కౌంటర్ ఇచ్చారు.

ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే అస‌లు లంబోర్ఘీని ఎవ‌ర‌ది? నిజంగా షూట్ కోసం వినియోగిస్తున్నారా? లేక ఇంకేదైనా కార‌ణం ఉందా? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. దీనంత‌టికీ కార‌ణంగా అది బ్లాక్ క‌ల‌ర్ లంబోర్ఘిని కావ‌డ‌మే.

గ‌తేడాదే ప్ర‌భాస్ ఎల్లో క‌ల‌ర్ అత్యాధునిక‌ లంబోర్ఘిని విక్ర‌యించారు. దాని ధర రూ. 5.01 కోట్లకు పైగా ఉంది. ఓపెన్-టాప్ సూపర్ కార్ అది. V-12 మోటార్ నుండి 730 బీహెచ్ పీ మరియు 630 ఎన్ .ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందా కార్. హైఎండ్ టాప్ మోడ‌ల్ కారు అది. ఇప్పుడు ప్ర‌భాస్ సెట్ లో డ్రైవ్ చేసిన లంబోర్ఘిని మ‌రొక‌టి. ఈ రెండింటి మ‌ధ్య వ్యత్యాసం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఆ సంగ‌తేంటో? డార్లింగ్ రివీల్ చేస్తే గానీ క్లారిటీ రాదు.