Begin typing your search above and press return to search.
'రాధేశ్యామ్' ప్రమోషన్స్ మీద ఫుల్ ఫోకస్ పెడుతున్న డార్లింగ్ టీమ్..!
By: Tupaki Desk | 30 Dec 2021 4:44 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ''రాధేశ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో దూకుడుగా ప్రమోషన్స్ చేయడానికి డార్లింగ్ అండ్ టీమ్ రెడీ అయ్యారు.
'రాధే శ్యామ్' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుంది. ఇటీవల వచ్చిన ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమోషనల్ మెటీరియల్ ని అందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అలానే సుడిగాలి ప్రమోషన్లతో 'రాధే శ్యామ్' చుట్టూ ఉన్న హైప్ ను మరో స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. జనవరి 7 నుండి ప్రభాస్ ఈ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాడని నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి.. ప్రముఖ మీడియా సంస్థలతో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
ఇక 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ ను డార్లింగ్ ఫ్యాన్స్ కూడా తమ బాధ్యతగా తీసుకుంటున్నారు. ఈ సినిమా గురించి కాలేజీలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ టీమ్ పలు నగరాల్లో ఫ్యాన్స్ మీట్ నిర్వహించబోతోంది. అభిమానులతో ఇంటరాక్ట్ అయి సినిమా విశేషాలను పంచుకోనున్నారు.
ఇందులో భాగంగా గురువారం ఉదయం కాకినాడలో ఫ్యాన్స్ మీట్ కు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో రాజమండ్రిలో ఫ్యాన్స్ మీట్ తో పాటుగా మ్యూజికల్ కన్సర్ట్ ని నిర్వహించనున్నారు. రాబోయే రోజుల్లో మిగతా ఏరియాల్లోనూ 'రాధే శ్యామ్' చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు చేయనున్నారు.
కాగా, యూరప్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ డ్రామాగా ''రాధే శ్యామ్'' చిత్రాన్ని తెరకెక్కించారు. లవ్ స్టోరీయే కాకుండా.. అంతకుమించి ట్విస్టులు ఉన్నట్లు చిత్ర బృందం చెబుతోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్య గా ప్రభాస్.. ప్రేరణగా పూజా కనిపించనుంది.
కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ - యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా 'రాధే శ్యామ్' చిత్రాన్ని నిర్మించాయి. హిందీలో టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో కృష్ణంరాజు - భాగ్యశ్రీ - జగపతిబాబు - మురళీ శర్మ - సచిన్ ఖేడ్‌కర్ - జయరామ్ - ప్రియదర్శి సచిన్ ఖేడ్కర్ - మురళి శర్మ - ఎయిర్ టెల్ శాషా ఛత్రి - రిద్ది కుమార్ - కునాల్ రాయ్ కపూర్ - సత్యన్ కీలక పాత్రలు పోషించారు.
'రాధే శ్యామ్' దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చారు. హిందీ వెర్షన్ కు మిథున్ - అను మాలిక్ - మనన్ భరద్వాజ్ కలసి మ్యూజిక్ అందించారు. ఇక తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్సన్స్ కు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యత ఎస్ఎస్ థమన్ తీసుకున్నారు. రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. ఆర్.రవీందర్ ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహించారు. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అందించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేశారు.
'బాహుబలి' సినిమాల తర్వాత ప్రభాస్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పాకిందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చిన 'సాహో' మూవీ భారీ వసూళ్లు రాబట్టి.. డార్లింగ్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ''రాధే శ్యామ్'' చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ తన కెరీర్ లో తొలిసారిగా ఒక్క ఫైట్ కూడా లేకుండా చేసిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.