Begin typing your search above and press return to search.
భార్యాభర్తల బంధాన్ని ప్రపంచానికి చాటిన `డార్లింగ్స్`!
By: Tupaki Desk | 14 Aug 2022 12:30 AM GMTభారతీయ సంస్కృతిలో భార్య భర్తల బంధానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతీయ మతాలలో వివాహ క్రతవు మతాన్ని బట్టి జరుగుతుంది. కానీ ఆ బంధం ఎంతో బలమైనది. విదేశీ కల్చర్ కి పూర్తి విరుధ్దం భారతీయ సంస్కృతి. భారతీయ జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మతాల్లో వివాహ బంధాన్ని బలపర్చడానికి కొత్త చట్టాలు సైతం తెరపైకి తీసుకొచ్చారు.
ఆ మతాల్లో కొంత ఘర్షణకి దారి తీసినప్పటికీ మహిళలు ఆ మాతం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఇందులో రాజకీయ కోణం ఉందని కొంత మంది వ్యతిరేకించినప్పటికీ వాస్తవాన్ని విశ్లేషించగల్గితే చట్టం యొక్క గొప్పతనం అర్ధమవుతుంది. బంధాలు బలపడేలా గానీ..చిధ్రమైపోతే ఇంకెక్కడి? భారతీయ సంస్కృతి అన్న విధానానికి కట్టుబడి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలతో మోదీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి సక్సెస్ అయింది.
ప్రపంచ దేశాల దృష్టిలో భారత సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకతను చాటుకుంటున్నాయంటే? కేవలం భార్యా భర్తల బంధం బలంగా ఉండటమే అన్నది గ్రహించాల్సిన విషయం. ఎన్ని అవరోధాలు ఎదురైనా జీవితాంతం కలిసి ఉండాలి అన్నదే భార్య భర్తల సిద్దాంతం అని `డార్లింగ్స్` రూపంలో భారతీయ సంస్కృతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది దర్శకులు జస్మీత్.కె. రీన్.
అలియాభట్-విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన `డార్లింగ్స్` ఇప్పుడు 16 దేశాల్లో ట్రెండింగ్ కంటెంట్ గా మారిందంటే? దానికి కారణం దర్శకురాలు కథని మలిచిన విధానం సహా భారతదేశంలో భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారు? అన్నది చాటి చెప్పడమే ప్రధానంగా కనిపిస్తుంది. విదేశాల్లో భార్య భర్తల బంధాలు ఎంతో బలహీనమైనవి. అక్కడి చట్టాలు వేరు. సాంకేతికంగా అభివృద్ది చెందుతోన్న దేశాలు బంధాల విషయంలోనూ అంతే సాంకేతికంగా ఉంటారన్నది తెలిసిన విషయం.
అక్కడి వివాహ వ్యవస్థల తీరు. విడాకులు తీసుకునే విధానాలు వేరు. ఇది పూర్తిగా భారతీయ బంధాలకు వ్యతిరేకం. ఒకసారి వివాహమైన తర్వాత జీవితంలో ఎలాంటి సమస్యలొచ్చినా....ఎలాంటి విబేధాలు తలెత్తినా కలిసే ఉండాలన్నది మన సంప్రదాయం. ఇక్కడే జస్మీత్ . కె. రీన్ తీసుకున్న పాయింట్ కథని మరింత రక్తి కట్టించింది.
ఓ ముస్లీం కుటుంబం భార్యా భర్తల మధ్య బంధాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేసారు. ఇక్కడే దర్శకురాలు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. వివాహం విషయంలో మొన్నటి వరకూ ముస్లీం లకు ప్రత్యేకమైన చట్టాలుడేవి. కానీ ఇప్పుడా చట్టంలో మార్పులొ చ్చాయి. ఆ మార్పుకు లోబడి `డార్లింగ్స్` చిత్రాన్ని మలిచారు అనొచ్చు. కథని కమర్శియాల్టీ కోసం..ఎంగేజ్ చేయడం కోసం మార్పులు చేసినప్పటికీ అంతిమంగా భార్య-భర్తల నేపథ్యాన్ని ఎంచుకుని తీసిన సినిమా ప్రపంచ దేశాల్లో ట్రెండింగ్ లో నిలిచిందంటే? దానికి కారణం దర్శకులు విజన్ సహా..కథలో పండిన పాత్రలని చెప్పాలి.