Begin typing your search above and press return to search.
'దసరా' బృందానికి ఐఫోన్-14 మొబైల్స్ గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత..!
By: Tupaki Desk | 24 Nov 2022 3:30 AM GMTనేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "దసరా". శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే నిర్మాత చిత్ర బృందానికి ఖరీదైన ఐఫోన్ మొబైల్ పోన్లను గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
"దసరా" సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న విధానం పట్ల నిర్మాత చాలా హ్యాపీగా ఉన్నాడట. సినిమా కోసం టీమ్ కష్టపడి పనిచేస్తున్నందుకు గాను 28 మందికి సరికొత్త ఐఫోన్-14 మొబైల్లను బహుమతిగా అందించారని తెలుస్తోంది.
మామూలుగా సినిమా హిట్టై లాభాలు వచ్చిన తర్వాత కొందరు నిర్మాతలు లేదా హీరోలు తమ టీమ్ కి ఏవైనా గిఫ్ట్స్ ఇస్తుంటారు. మరికొందరు సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత బహుమతులు ఇస్తారు. అయితే ' 'దసరా' నిర్మాత సుధాకర్ మాత్రం చిత్రీకరణ దశలో ఉన్నప్పుడే విలువైన గిఫ్ట్స్ అందించారు. ఇది సినిమా సక్సెస్ పై ప్రొడ్యూసర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారనేది అర్థమవుతుంది.
చెరుకూరి సుధాకర్ మొదటి నుంచీ విభిన్నమైన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను నిర్మిస్తూ మంచి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. కాకపోతే సరైన ఫలితం మాత్రం అందుకోలేకపోతున్నారు. 'పడి పడి లేచె మనసు' 'ఆడవాళ్లు మీకు జోహార్లు' 'విరాట పర్వం' 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు. దీంతో ఇప్పుడు "దసరా" సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.
’దసరా‘ చిత్రానికి శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక పీరియాడికల్ యాక్షన్ చిత్రం. తెలంగాణ గోదావరిఖని లోని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. నాని ఇందులో రా అండ్ రస్తిక్ లుక్ లో కనిపించనున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని - సాయి కుమార్ - జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
'దసరా' చిత్రానికి విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. అన్బరీవ్ యాక్షన్ డిజైన్ చేశారు.
శ్రీరామ నవమి సందర్భంగా 2023 మార్చి 30న "దసరా" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హిందీ తమిళం కన్నడ మరియు మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.