Begin typing your search above and press return to search.
యండమూరితో దశరథుడి అనుబంధం
By: Tupaki Desk | 11 Feb 2016 4:17 AM GMTదశరథ్ అంటే క్లాస్ సినిమాల దర్శకుడిగా గుర్తింపు ఉంది. ప్రభాస్ తో మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాతో ఈయన టాప్ దర్శకుల జాబితాలోకి చేరిపోయాడు. ఆ తర్వాత నాగార్జునతో చేసిన గ్రీకువీరుడు ఫ్లాప్ కావడంతో.. గ్యాప్ తీసుకుని జాగ్రత్తగా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం మంచు మనోజ్ - రెజీనా కాంబినేషన్ లో శౌర్యను రిలీజ్ కి రెడీ చేశాడీ డైరెక్టర్.
సినీ రంగంలోకి ప్రవేశించేందుకు ప్రతీ దర్శకుడికీ ఓ మార్గం, ఓ మార్గదర్శకుడు ఉంటారు. తను సినిమా ఫీల్డ్ లో ప్రవేశించడానికి కారణం.. రచయిత కం దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ అని చెప్పాడు దశరథ్. చిన్నప్పటి నుంచి ఈయనకు ఉన్నది రెండే అలవాట్లట. ఒకటి ఇళయరాజా పాటలు వినడం, ఇంకొకటి యండమూరి రచనలు చదవడం. అయితే సినిమాల మీద మోజుతో చదువు మధ్యలోనే ఓసారి పరిశ్రమలోకి వచ్చి తర్వాత వెనక్కి వెళ్లి మళ్లీ చదువులో పడ్డాడట దశరథ్. ఓ సారి యండమూరి రచనలు ఆహ్వానించినపుడు.. సరదాగా పంపిన ఓ కథ బాగా నచ్చడంతో.. ఉత్తరం రాసి ఆహ్వానించారట ఆయన.
అలా వచ్చి ఆయన తీసే ఆనందో బ్రహ్మ సీరియల్ తో జర్నీ ప్రారంభించిన దశరథ్.. స్క్రీన్ ప్లే రైటర్ - డైలాగ్ రైటర్ - అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎదిగాడట. యండమూరి తీసిన వెన్నెల్లో ఆడపిల్ల సీరియల్ కు కూడా పని చేసిన తర్వాత.. ఆయనే పరుచూరి బ్రదర్స్ దగ్గరకు పంపి.. సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా మార్చారట. సింపుల్ గా చెప్పినా.. దశరథ్ చాలా సుదీర్ఘమైన ప్రయాణమే.