Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా కేట‌గిరిలో దాస‌రి అవార్డులు!

By:  Tupaki Desk   |   16 March 2022 8:30 AM GMT
పాన్ ఇండియా కేట‌గిరిలో దాస‌రి అవార్డులు!
X
దివంగ‌త ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు పేరిట ప‌లు సంస్థ‌లు ప్ర‌తీ ఏడాది అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రుపుతోన్న సంగ‌తి తెలిసిందే. దాస‌రి జ్ఞాప‌కాల్ని స్మ‌రించుకుంటూ ఏర్పాటు చేసిన అవార్డుల వేడుక ప్ర‌తీ ఏటా ఎంతో వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నారు.దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్'..రాక్‌స్టార్‌ ఈవెంట్స్, కింగ్‌ మీడియా ఈవెంట్స్..ప‌లు ఎన్ ఆర్ ఐ సంస్థ‌లు వంటి సంస్థ‌లు పెద్ద ఎత్తున దాస‌రి అవార్డ‌లు కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హిస్తున్నాయి.

దాస‌రి జ‌యంతి..వ‌ర్ధంతి దినోత్స‌వాల సంద‌ర్భంగా అవార్డుల వేడుక‌ల కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. తాజాగా దాస‌రి నేష‌న‌ల్ ఫిల్మ్ అండ్ టీవీ నేష‌న‌ల్ అవార్డుల వేడుకకు రంగం సిద్ద‌మైంది. మే 4న దాసరి జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తీ ఏడాది ఈ అవార్డ‌ల కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డానికి నిర్మాత తాడివాక రమేష్ నాయుడు న‌డుం బిగించారు. "దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్" పేర‌టి ప్ర‌తీ ఏటా మే 4న‌ తెలుగు రాష్టాల సిఎం లు ముఖ్య అతిధులుగా పాన్ ఇండియా స్దాయిలో అవార్డ‌లు వేడుక కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.

ఈ స‌ద‌ర్భంగా నిర్మాత తాడివాక ర‌మేష్ నాయుడు అవార్డుల ఉద్దేశాన్ని వెల్ల‌డించారు. "నా గురువు.. దైవం అయిన దాసరి పేరిట ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టివి నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పించాము. పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ భాషా చిత్రాల టెక్నిషియన్స్ కు దాసరి నేషనల్ అవార్డ్ లను ప్రధానం చేయబోతున్నాము. ఇందుకోసం ఇప్పటికే "దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్" ఏర్పాటు చేసాం.

వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నాము. భారీ స్దాయిలో హైదరాబాదు లో జరగనున్న ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల్ని లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నాము. వేదిక - అవార్డు కమిటీ కి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్ల‌డిస్తామ‌"న్నారు.

దాస‌రి పేరిట‌ పాన్ ఇండియా కేట‌గిరిలో అవార్డులు ఇవ్వ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టులు-సాంకేతిక నిపుణుల‌కే అవార్డులు అందించ‌డం జ‌రిగింది. తొలిసారి దాసరి అవార్డుల వేడుక‌ను పాన్ ఇండియా స్థాయిలో నిర్వ‌హించ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం.

దాస‌రి పేరిట ఆయ‌న్ని స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన అవార్డ‌లు ప‌ట్ల దాసరి అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ద‌ర్శ‌కుడిగా..న‌టుడిగా..నిర్మాత‌గా..సంగీత ద‌ర్శ‌కుడిగా..ర‌చ‌యిత‌గా ఆయ‌న భౌతికంగా అభిమానుల మ‌ధ్య లేక‌పోయినా దాస‌రి అందించిన సేవ‌లు ఎప్ప‌టికీ చిర‌స్మ‌ర‌ణీయ‌మే. దాస‌రి 140 చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాష్ర్టీయ్య‌-జాతీయ స్థాయి స‌హా ఎన్నో ఫిలిం అవార్డులు..రివార్డులు ఆయ‌న సొంతం.