Begin typing your search above and press return to search.
దాసరి బయోపిక్ చాలా మంది ప్రకటించారు కానీ!
By: Tupaki Desk | 11 July 2021 9:30 AM GMTఎన్టీఆర్ బయోపిక్.. సావిత్రి బయోపిక్.. చివరికి చేనేత మల్లేశం బయోపిక్ కూడా తెరకెక్కి రిలీజయ్యాయి. ఆ క్రమంలోనే దాసరి బయోపిక్ .. ఏఎన్నార్ బయోపిక్ అంటూ చర్చ మొదలైంది. ఏఎన్నార్ బయోపిక్ తీయలేమని అక్కినేని కాంపౌండ్ ఒకానొక సందర్భంలో అస్పష్ఠంగా వెల్లడించింది. కానీ దాసరి బయోపిక్ ని తెరకెక్కిస్తామని ఆయన శిష్యులంతా ఊరేగారు. దాసరి ఉన్నన్నాళ్లు ఆ కాంపౌండ్ గింజలు తిన్న వాళ్లంతా తాము కన్ఫామ్ గా బయోపిక్ లు తీస్తామంటూ ప్రటించారు. ప్రతిసారీ జయంతి వర్ధంతి వేళ పెద్దాయన విగ్రహాలతో ఫోటోలు దిగి బయోపిక్ ఒకటి పెండింగ్ ఉందని చెప్పేవారు. కానీ ఎవరూ డబ్బు పెట్టి సినిమా తీసేందుకు ముందుకు రాలేదు.
కానీ దాసరి శిష్యుల్లోనే ధవళ సత్యం తాజాగా దాసరి బయోపిక్ తీస్తున్నామని ప్రకటించారు. దీంతో ఇండస్ట్రీలో ఒకటే హాట్ టాపిక్ గా మారింది. ఆయన ప్రకటించారు కానీ తీస్తారా? అని చెణుకులు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకుముందు దాసరి శిష్యుల్లో కీలక సభ్యులు సి.కళ్యాణ్.. రేలంగి సహా పలువురు దాసరి బయోపిక్ ప్రకటనలు చేసినా ఏదీ ముందుకు వెళ్లకపోవడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.
మరోవైపు దాసరి జీవితంలో అన్ని విషయాల్ని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారా? లేక ఎన్టీఆర్ బయోపిక్ లా చేస్తారా? అంటూ ఓ వర్గం గుసగుసలు మొదలైపోయాయి. పరిశ్రమ అగ్ర హీరోతో 90లలోనే దాసరి ఘర్షణ.. మరణానికి ముందు దాసరి కుటుంబంలో కలహాలు.. మంత్రిగా ఉన్నప్పటి కుంభకోణం.. వగైరా వగైరా నిజాల్ని చూపిస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఓవరాల్ గా దాసరి బయోపిక్ ని ప్రకటించారు కానీ.. ఆయనలో పాజిటివ్ కోణాన్ని మాత్రమే చూపిస్తే జనం చూస్తారా? మనిషి జీవితం కాంప్లికేషన్స్ తో కూడుకున్న సంఘర్షణ. అది మొత్తం చూపిస్తేనే బయోపిక్ అవుతుందన్న వాదన మళ్లీ తెరపైకొచ్చింది. మరి దాసరి బయోపిక్ లో ఉన్నదున్నట్టు చూపిస్తారా..?