Begin typing your search above and press return to search.

‘వంగవీటి’ టైటిలే రిజిస్టర్ చేసుకోనివ్వలేదా?

By:  Tupaki Desk   |   30 Dec 2016 1:30 AM GMT
‘వంగవీటి’ టైటిలే రిజిస్టర్ చేసుకోనివ్వలేదా?
X
‘వంగవీటి’ పేరుతో సినిమా తీయడమే కాదు.. సెన్సార్ ఇబ్బందులేమీ కూడా లేకుండా సినిమాను కూడా రిలీజ్ చేసేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. బయట ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ సినిమా ఆగలేదు. వివాదాల పుణ్యమా అని సినిమాకు అనుకున్న దాని కంటే ఎక్కువ వసూళ్లే వచ్చాయి. ఐతే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిపోతున్న టైంలో నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. ఈ సినిమా టైటిల్ ను రిజిస్టర్ చేయించుకోవడానికి ఏపీ ఫిలిం ఛాంబర్ అంగీకరించలేదట. దీంతో తెలంగాణ ఫిలిం ఛాంబర్లో టైటిల్ రిజిస్టర్ చేయించి.. ఆ తర్వాత సినిమా షూటింగ్ చేశామని.. ఈ టైటిల్ ఎందుకు రిజిస్టర్ చేసుకోమన్నారో అర్థం కాలేదని చెప్పాడు దాసరి కిరణ్ కుమార్.

ఇక ‘వంగవీటి’ విడుదల తర్వాత తాను అజ్నాతంలోకి వెళ్లిపోయినట్లు వస్తున్న వార్తల్ని దాసరి కొట్టిపారేశాడు. ఇంత పెద్ద సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసి.. తాను అందుబాటులో లేకుండా ఎలా ఉంటానని దాసరి ప్రశ్నించాడు. ఈ సినిమాపై ఎన్ని వివాదాలు ఎదురైనప్పటికీ.. తనకైతే సినిమాలో ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పాడు. స్క్రిప్టు దశలోనే తాను సినిమాకు ఆమోదం తెలిపానని.. ఫైనల్ ప్రాడక్ట్ తనకు చూపించకుండానే వర్మ రిలీజ్ చేశాడన్న వార్తల్లో వాస్తవం లేదని దాసరి చెప్పాడు. దర్శకుడు వర్మతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని దాసరి స్పష్టం చేశాడు. విజయవాడకు చెందిన కొన్ని కుటుంబాలు కూడా సినిమా చూశాయని.. అభ్యంతరాలేమీ రాలేదని.. ఐతే వంగవీటి రాధా మాత్రం ఈ సినిమా విషయంలో తాము ఇచ్చిన వివరణతో కన్విన్స్ అయినట్లు కనిపించలేదని దాసరి తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/