Begin typing your search above and press return to search.
రామోజీ-దాసరి.. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ
By: Tupaki Desk | 7 Jun 2017 9:37 AM GMTమీడియా మొఘల్ రామోజీ రావుకు.. దర్శకరత్న దాసరి నారాయణరావు ఒక సమయంలో బద్ద శత్రువులుగా మెలిగారన్న సంగతి తెలిసిందే. దశాబ్ద కాలానికి పైగా వీరి మధ్య శత్రుత్వం కొనసాగింది. ఎక్కడ తేడా వచ్చిందో ఏమో కానీ.. దాసరి రామోజీని దెబ్బ కొట్టేందుకు ఉదయం అనే పత్రికను తెచ్చి ఆయనలో కంగారు పుట్టించారు. మరోవైపు రామోజీ తన పత్రికలో.. టీవీ ఛానెళ్లలో దాసరి ఊసే లేకుండా చూసుకున్నారు. ఆయన సినిమాలు ప్రసారమైనపుడు దర్శకుడిగా దాసరి పేరే చూపించకుండా చేసేంతగా ఆయనపై కక్షగట్టారు రామోజీ. రామోజీ ఫిలిం సిటీ మొదలయ్యాక మొత్తం ఇండస్ట్రీ జనాలందరూ అక్కడెళ్లి షూటింగులు చేస్తుంటే దాసరి మాత్రం అటువైపు చూడలేదు. ఇంతటి శత్రువులుగా ఉన్న వాళ్లు మళ్లీ ఎలా కలిశారన్నది ఆసక్తికరం. వారం కిందట దాసరి కాలం చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన స్టోరీ బయటికి వచ్చింది.
రోజులు గడిచేకొద్దీ ఎవ్వరికైనా పట్టుదల తగ్గుతుందంటారు. అలాగే తన సినిమా షూటింగ్ కోసం నిర్మాత బలవంతం చేస్తే దాసరి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లడానికి అంగీకరించారు. అలా వెళ్లి షూటింగ్ చేస్తుండగా.. ఆ సంగతి రామోజీకి తెలిసింది. వెంటనే తన సిబ్బందిని పురమాయించి దాసరిని విందుకు ఆహ్వానించారు. తన ఇంటికి వచ్చిన దాసరికి బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశారు. ఆ విందు సమయంలోనే ఇద్దరూ పాత విషయాలన్నీ మరిచిపోయి సినిమాల గురించి.. రాజకీయాల గురించి చాలా ముచ్చట్లు చెప్పుకున్నారు. ఆపై రామోజీ స్వయంగా బయటికి వచ్చి దాసరిని సాగనంపారు. రామోజీ ఇంటి నుంచి బయటికి రాగానే అక్కడి నుంచి గేటు వరకు ఫిలిం సిటీ సిబ్బంది ఇరువైపులా నిలబడి దాసరి మీద పూల వర్షం కురిపిస్తూ సాగనంపారట. అది చూసి దాసరి పరమానందభరితుడైనట్లు సమాచారం. అప్పట్నుంచి రామోజీ-దాసరి మధ్య స్నేహం కొనసాగింది. దాసరి మళ్లీ ఈనాడు.. ఈటీవీల్లో కనిపించారు. ఇటీవలే ఆయన చనిపోయినపుడు కూడా ఆ పత్రిక.. ఛానెళ్లలో విస్తృతమైన కవరేజీ ఇచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/