Begin typing your search above and press return to search.
ఒక గొప్ప శకం ముగిసింది... కీర్తి మిగిలింది
By: Tupaki Desk | 31 May 2017 9:45 PM ISTఒక శకం ముగిసింది. తెలుగు సినిమా మేరు నగధీరుడి శకం ముగిసింది. ఒక జీవితం... కానీ బహుముఖాలు. ఎన్నో మలుపులు తిరిగి, ఎందరి జీవితాలనో మలుపులు తిప్పి... మందికి దారి చూపి మనిషిని గౌరవించిన ఓ మనసు ఈ కీర్తికి చిరునామాగా నిలిచిన భౌతిక కాయాన్ని వదిలి శాశ్వతంగా వెళ్లిపోయింది.
తన సొంతంగా ఏర్పాటుచేసుకున్న వ్యక్తిగత వ్యవసాయాహ్లాద క్షేత్రంలో పరమపదించిన తన సతి సమాధి పక్కనే ఆయన శాశ్వతంగా చేరిపోయారు. ఎన్నోపదవులు అలంకరించిన ఆయన, ప్రభుత్వ లాంఛనాల మధ్య తన పెద్ద కుమారుడు హరిహర ప్రభు చితికి నిప్పంటించగా ఈ లోకాన్ని, సినీ లోకాన్ని వదిలి కీర్తిని మాత్రం మోసుకుని వెళ్లిపోయారు.
రికార్డులు, రివార్డులు.. అలవోకగా వచ్చేవి. ఒక పెద్ద గొంతు, ఒక పెద్ద మనసు, ఒక పెద్ద మనిషి అందరనీ, అన్నిటినీ విడిచి వెళ్లిపోయారు. ఆయన దారి ఆయన చూసుకున్నారు. ఇన్నాళ్లు దారిచూపిన వెలుగు రేఖ ఒక్కసారిగా మాయమైనట్టు తెలుగు సినిమా మరో సారి బిగ్గరగా బోరుమంది. ఆయన ఎవర్నీ బాధించకపోయినా... అనారోగ్యం మాత్రం ఆయనను తీవ్రంగా బాధించింది. కలకు, కళకు బంధాన్ని దృఢంగా మార్చిన దాసరి పేరు రికార్డుల్లోనే కాదు, వెండితెరపై చిరస్థాయిగా నిలిచిపోతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/