Begin typing your search above and press return to search.

దాసరి విగ్రహంపై బాబు అసంతృప్తి?

By:  Tupaki Desk   |   15 May 2018 6:19 AM GMT
దాసరి విగ్రహంపై బాబు అసంతృప్తి?
X
ఇటీవల దాసరి నారాయణ రావు జన్మదిన సందర్బంగా సినీ ప్రముఖులు ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా దర్శక గురువుగా ఆయనను తారలు గుర్తు పెట్టుకోవాలని అందరు నిర్ణయం తీసుకున్నారు. అయితే దాసరి విగ్రహ ప్రతిష్టపై నటుడు మోహన్ బాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాసరి కి అత్యంత సన్నిహితులైన వారిలో మోహన్ బాబు ఒకరని అందరికి తెలిసిందే.

అయితే దాసరి విగ్రహ ప్రతిష్టను అవమానకరంగా మట్టితో తాయారు చేయడాన్ని ఆయన వ్యక్తిరేకించినట్లు మోహన్ బాబు సన్నిహతుల ద్వారా తెలిసింది. లెజెండ్ లాంటి దర్శకుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా? అలాగే దాసరి గారు నన్ను ఎంతగానో ఇష్టపడతారు. అది రాష్ట్ర ప్రజలకు తెలుసు అలాంటిది నన్ను విగ్రహప్రతిష్ట కార్యక్రమానికి పిలవలేదని మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే నిర్మాత సి.కళ్యాణ్ పరోక్షంగా ఆ వ్యాఖ్యలపై స్పందించినట్లు తెలుస్తోంది.

నా సొంత డబ్బుతో దాసరి గారు విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. మట్టితో ఆయన విగ్రహాన్ని ఎలా తయారు చేస్తాం?. బ్రోన్జ్ మరియు ఇతర ఉపయోగకరమైన కెమికల్స్ కలిపి గురువుగారి స్టాట్యూని నిర్మించామని నిజా నిజాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని సి కళ్యాణ్ మోహన్ బాబు గారికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మోహన్ బాబును ఆహ్వానించగా ఆ సమయంలో ఆయన అందుబాటులో లేరని ఆయన సన్నిహితులు చెప్పినట్లు సి.కళ్యాణ్ వివరించారట. దీంతో రూమర్స్ వల్ల ప్రస్తుతం ఇండస్ట్రీలో చీలికలు వచ్చాయని టాక్ వస్తోంది.